కాజల్‌ ఎంత ఇచ్చినా ఒప్పుకోలేదు.. అంజలి ఓకే చెప్పేసింది     2018-08-26   09:02:41  IST  Ramesh Palla

యాంగ్రీ యంగ్‌మన్‌ రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కిన ‘గరుడవేగ’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రం ఇచ్చిన సక్సెస్‌తో రాజశేఖర్‌ మరో భారీ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు. గరుడవేగ చిత్రం తర్వాత హీరోగా సినిమాలు చేయవద్దని నిర్ణయించుకున్న రాజశేఖర్‌ సక్సెస్‌ కారణంగా మళ్లీ హీరోగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. గరుడవేగ చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న రాజశేఖర్‌ ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ కూడా విడుదల చేయడం జరిగింది.

1980 కాలంలో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అధికారికంగా ప్రకటించేశాడు. తెలంగాణ నేపథ్యంలో ఉండబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా మొదటి నుండి కూడా కాజల్‌ను అనుకుంటూ వచ్చారు. కాజల్‌ అయితే సినిమా స్థాయి పెరుగుతుందని భావించారు. కాని రాజశేఖర్‌తో నటించేందుకు కాజల్‌ నో చెప్పింది. చిన్న హీరోలతో కూడా నటించేందుకు ఆసక్తిగా ఉన్న కాజల్‌ సీనియర్‌ హీరో అయినా రాజశేఖర్‌తో ఎందుకు నటించేందుకు నో చెప్పిందో అర్థం కావడం లేదు. భారీ పారితోషికం ఆఫర్‌ చేసినా కూడా కాజల్‌ మాత్రం నో అంటే నో అనేసింది.

The Good Offer Misses Kajal And Caches Anjali-

The Good Offer Misses Kajal And Caches Anjali

కాజల్‌ నో చెప్పడంతో ఆ స్థానంలో ముద్దుగుమ్మ అంజలిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగమ్మాయి అయిన అంజలి తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. అప్పుడప్పుడు తెలుగులో సినిమాలు చేస్తున్నా కూడా ఈమెకు స్టార్‌డం మాత్రం దక్కడం లేదు. తెలుగులో ఈమె చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ప్రభావంను చూపించడంలో విఫలం అవుతున్నాయి. అందుకే ఎక్కువగా తమిళ సినిమా పరిశ్రమపైనే అంజలి దృష్టి పెట్టింది.

The Good Offer Misses Kajal And Caches Anjali-

రాజశేఖర్‌తో చేయబోతున్న ఈ చిత్రంతో అయినా అంజలికి తెలుగులో స్టార్‌డం దక్కుతుందో చూడాలి. 1980 కాలం నేపథ్యంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే రాజశేఖర్‌ మూవీ కూడా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంను అప్పుడే సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ చిత్రం ఆకట్టుకుంటే కాజల్‌ మంచి ఛాన్స్‌ మిస్‌ అయినట్లుగా బాధపడాల్సి వస్తుంది.