ఏనుగు ఎక్కి జారిపడ్డ డిప్యూటీ స్పీకర్ !   The Deputy Speaker Falls Off Elephant At Assam     2018-10-08   17:43:23  IST  Sai M

అంబారీ మీద గొప్పగా ఊరేగుదమున్న ఆ నాయకుడి ఆశలు గల్లంతయ్యాయి… అదుపుతప్పి ఏనుగు మీద నుంచి కిందపడడంతో ప్రజలంతా గొల్లుమని నవ్వారు. ఇదేంట్రా బాబు ఏనుగు మీద ఊరేగుతూ తన దర్పం ప్రదర్శిద్దామనుకుంటే… ఉన్న పరువు ఇలా రోడ్ మీద పడింది అని ఆ నేత అవమానంతో తన కౌకు దెబ్బలు చూసుకుని లబోదిబోమన్నాడు.

అసోం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఏనుగుపై నుంచి జారి కిందపడ్డారు. కరీంగంజ్‌ జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన రాతాబరిలో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో కృపానాథ్‌ మల్లాహ్‌ ఏనుగుపైకి ఎక్కారు. ఒక్కసారిగా ఏనుగు ముందుకు వెళ్లడంతో పట్టు కోల్పోయి కింద పడ్డారు. అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు కాలేదు. ఇటీవలే మల్లాహ్‌ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నియ్యారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మల్లా ఏనుగుపైకి ఎక్కారు. భారీగా కార్యకర్తలు గుమిగూడటంతో ఏనుగు బెదిరి ముందుకు వెళ్లడంతో ఆయన ఇలా కిందపడాల్సి వచ్చింది.