అద్భుతం : పిడుగుపడి ఇల్లంతా కాలిపోయినా..ఊయలలోని బాబుకి ఏం కాలేదు..

సాధారణంగా పిడుగు పడితే ఎలా ఉంటుంది.పిడుగు పడిన ప్రదేశంతో మాడి మసైపోవడంతో పాటు దీని ప్రభావం చుట్టుపక్కల కూడా ఉంటుంది.

 The Boy Not Affected By Thunder At Sabbavaram In Visakhapatnam-TeluguStop.com

అలాంటిది ఇంటిపై పిడుగు పడ్డా ఓ చిన్నారితోపాటు తల్లి ఎలాంటి ప్రమాదం లేకుండా క్షేమంగా బయటపడ్డారు.ఈ అద్భుతం విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది…పిడుగుపడినా ప్రాణాలతో బయటపడిన ఆ తల్లీకొడుకులను చూడ్డానికి జనం తండోపతండాలుగా వాళ్లింటి బాట పట్టారు.

విశాఖపట్నంలోని సబ్బవరానికి చెందిన నక్క దేవప్రసాద్‌, సారూమ్‌ రోజా దంపతులు స్థానికి సాయిరాం నగర్ కాలనీలో నివసిస్తున్నారు.వీరికి ఏడాదిన్న వయసున్న బాబు వినయ్ రంజిత్ కూడా ఉన్నాడు.వినయ్‌ ఏడుస్తుంటే చీరతో కట్టిన ఊయలలో బాబుని వేసి నిద్ర పుచ్చుతోంది రోజా.అదే సమయంలో భారీ వర్షం కురిసి, ఓ పిడుగు వారి ఇంటిపై పడింది…ఇంట్లోని టీవీ, ఫ్రిజ్‌, ఫ్యాన్లు అన్నీ ధ్వంసమయ్యాయి.

పిడుగుపాటుకు ఇంట్లోని ఫ్లోరింగ్ కూడా దెబ్బతింది.చిన్నారి నిద్రపోతున్న ఊయల సైతం కాలిపోయింది.

ఇంత జరిగాక ఎవరైనా ఇంట్లో ఉన్న తల్లి కొడుకు ఇద్దరూ చనిపోయుంటారని అందరూ భావిస్తారు కానీ, ఊయలలో ఉన్న బాలుడికి, దాన్ని ఊపుతున్న తల్లికి మాత్రం చిన్న ప్రమాదం కూడా జరగలేదు.ఈ సంఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ వారిని మృత్యుంజయులంటున్నారు.అంతేకాదు బాలుడి తల్లి ఎంతో అదృష్టవంతురాలని పేర్కొంటున్నారు…నిజమే కదా పిడుగుపడి ఇల్లంతా కాలిపోవడం ఏంటి.వారిద్దరికి ఏం కాకపోవడం ఏంటి.అధ్బుతం కాక మరేమిటి??

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube