అగ్రరాజ్యంలో తెలుగు యువకుడి దారుణ హత్య..   Telugu Young Employee Prithviraj Shot Dead In America     2018-09-07   16:52:41  IST  Sainath G

అగ్రరాజ్యం అనేది పేరుకు మాత్రమె తప్ప అమెరికాను చూసి నేర్చుకోవాల్సింది ఏమి లేదనే చెప్పాలి..ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని విషసంస్కృతి కేవలం అమెరికాలో మాత్రమే ఉంది..అక్కడ ఉన్న గన్ కల్చర్ ఎంతో మంది ప్రాణాల మీదకి తెస్తోంది..చిన్న చిన్న కుర్రాళ్ళు సైతం చేతిలో తుఫాకులు పట్టుకుని మరీ స్కూల్ కి వెళ్తున్నారు అంటే ఎంతటి విచ్చలవిడితనం అక్కడ ఉందో అర్థం అచేసుకోవచ్చు..స్కూల్ లో టీచర్ కొట్టిందని ఏకంగా గన్ స్కూల్ కి తీసుకుని వెళ్లి టీచర్ ని చంపిన సందర్భాలు అనేకం ఉన్నాయి..ఇదిలాఉంటే

సరిగ్గా రెండు నెలల క్రితం అమెరికాలో ఒక వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు కి చెందిన సురేష్ అనే యువకుడిని కాల్చి చంపాడు అయితే ఈ ఘటన జరిగిన తరువాత అతడిని అమెరికా పోలీసులు పట్టుకునే సమయంలో కాల్చి చంపేశారు అయితే ఈ ఘటన జరిగి రెండు నెలలు కాకముందే మరొక ఘటన అమెరికాలొఅ చోటు చేసుకోవడం ఎంతో విచారకరమని అంటున్నారు

Telugu Young Employee Prithviraj Shot Dead In America-

జిల్లా తెనాలికి చెందిన కందేపి పృథ్వీరాజ్‌ అనే యువకుడు ఇదే తరహాలో దుర్మరణం చెందాడు వివరాలలోకి వెళ్తే..సిన్సినాటిలోని వాల్‌నట్‌ స్ట్రీట్‌లోని బ్యాంక్‌లోని ఉద్యోగులపై గురువారం ఉదయం ఆకస్మాత్తుగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు..ఈ ఘంటనలో అక్కడికక్కడే ముగ్గురు చనిపోగా వారిలో ఒకరు పృథ్వీరాజ్‌ అని తెలిసింది. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన దుండగుడు ఒమర్‌ పెరాజ్‌…పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు..త్వరలోనే తన కుమారుడికి పెళ్లి చేయాలని అనుకున్నామని ఈలోగా ఇంట ఘోరం జరిగిపోయిందని అతడి తల్లి తండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు..