చికాగోలో...తెలుగు విద్యార్ధి.. దుర్మరణం.   Telugu Student Dies In Chicago Train Accident     2018-09-06   12:01:20  IST  Bhanu C

అమెరికాలో చదువుకుని మంచి ఉద్యోగం సాధించి తన తల్లి తండ్రులని సుఖపెట్టాలని ,వారిని సంతోష పెట్టాలని భావించిన ఓ తెలుగు విద్యార్ధి ఆశలు అడిఆశలు అయ్యాయి..చికాగో లో నాగరాజు అనే తెలుగు విద్యార్ధి నేపర్విల్లె వద్ద రైలు ప్రమాదానికి గురయ్యి మరణించాడు..ట్రాక్ దాటుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని అక్కడ ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుసుకున్నారు..అయితే ఈ విషయం వారి తల్లి తండ్రులకి తెలియడంతో కుటుంభంలో విషాద చాయలు అలుముకున్నాయి.

అయితే మృతుడి కుటుంభానికి సాయం చెయడానికి ఆటా ముందుకు వచ్చింది..ఆటా తరుపున మహిపాల్ రెడ్డి మృతుడి కుటుంభాన్ని పరామర్శించారు వారికి సహాయం చేయనున్నారు..అయితే ఆటా సేవా బృందం ప్రతినిధి మాట్లాడుతూ ఈ ఉదయం మృతుడి కుటుంభాన్ని కలిశానని వారికి ఎంతో సాయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు..పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.

Telugu Student Dies In Chicago Train Accident-

మృతుడు నాగరాజు తల్లిదండ్రులు భారతదేశం నుంచి చికాగోకు రాబోతున్నట్లుగా తెలిపారు..వారు ఇక్కడికి వచ్చిన తర్వాత తరువాత జరగవలసిన అంత్యక్రియల పై ఒక నిర్ణయం తీసుకుంటామని వారికి ఆటా తరుపున పూర్తి మద్దతు కూడా ఉంటుందని తెలిపారు..వారు చికాగో వచ్చిన నాటి నుంచీ వెళ్ళే వరకూ కూడా ఆటా సభ్యులు వెన్నంటే ఉంటారని ఆయన తెలిపారు.