‘దేవదాస్‌’ పక్కా కాపీనే.. దర్శకుడి మాటలు పచ్చి అబద్దం   Telugu Devadas Movie Is Remake Of Hollywood Movie Analyze This Movie     2018-09-22   11:21:51  IST  Ramesh P

నాగార్జున, నాని కలిసి నటించిన మల్టీస్టారర్‌ చిత్రం ‘దేవదాస్‌’ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. నాగార్జున, నాని నటిస్తున్న సినిమా అనగానే అందరి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు శ్రీరామ్‌ ఆధిత్య భారీ ఎత్తున ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అశ్వినీదత్‌ ఈ చిత్రంను నిర్మించిన కారణంగా సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. మహానటి చిత్రం తర్వాత ఈ చిత్రంను నిర్మించిన అశ్వినీదత్‌ మరో విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ చిత్రంపై మొదటి నుండి కాపీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

హాలీవుడ్‌ చిత్రం ‘అనాలసిస్‌ దిస్‌’ అనే చిత్రానికి ‘దేవదాస్‌’ కాపీ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమా ప్రారంభంలో సోషల్‌ మీడియాలో రీమేక్‌, కాపీ అంటూ వచ్చిన వార్తలను దర్శకుడు శ్రీరామ్‌ ఆధిత్య స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా కొట్టి పారేశాడు. తాను ఒక కొత్త కథతో, సొంత కథతో సినిమాను చేస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు. దాంతో అప్పుడు ఆ ప్రచారం ఆగిపోయింది. తాజాగా సినిమా ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో మరోసారి ‘అనాలసిస్‌ దిస్‌’ చిత్రం వార్తల్లోకి వచ్చింది.

రెండు చిత్రాలను పక్క పక్కన పెట్టి సోషల్‌ మీడియాలో కంపైరింగ్స్‌ జరుగుతున్నాయి. అనాలసిస్‌ దిస్‌ చిత్రంలోని రాబర్డ్‌ డెనిరో పాత్రకు నాగార్జున పాత్రకు చాలా దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. ఇద్దరి బాడీలాంగ్వేజ్‌ మరియు పాత్ర తీరు చాలా క్లోజ్‌గా ఉన్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా కాపీ అంటున్నారు. కేవలం నాగార్జున పాత్రనే కాదు నాని పాత్రను కూడా కాపీ చేయడం జరిగింది.

Telugu Devadas Movie Is Remake Of Hollywood Analyze This Movie-

అనాలసిస్‌ దిస్‌ చిత్రంలోని బిల్లీ క్రిస్టల్‌ పాత్రను పోలి నాని పాత్ర ఉంది. ఇక సినిమా పూర్తిగా విడుదలైతే సినిమా ఏ మేరకు కాపీ చేశాడు లేదా మొత్తంగా రీమేక్‌ చేశాడా అనే విషయం తెలిసే అవకాశం ఉంది. హాలీవుడ్‌లో 1999లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకుని సక్సెస్‌ను దక్కించుకుంది. మళ్లీ ఇప్పుడు అదే నేపథ్యంతో శ్రీరామ్‌ ఆధిత్య చిత్రాన్ని చేయడం జరిగిందని దాదాపుగా క్లారిటీ వచ్చేస్తోంది. దర్శకుడు రీమేక్‌ కాదు అంటూ అప్పుడు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఎలా స్పందిస్తాడో చూడాలి.