తెలుగు బిగ్‌బాస్‌ హౌస్‌ కోసం రోజుకు 5 లక్షలు     2018-08-10   10:49:37  IST  Ramesh Palla

తెలుగు బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ కోసం సెట్‌ను పుణె సమీపంలో నిర్మించిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ వారంలో రెండు రోజులు అక్కడకు వెళ్లి షూటింగ్‌ జరిపేవాడు. కాని ఇప్పుడు హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలోనే బిగ్‌బాస్‌ సీజన్‌ 2 కోసం సెట్‌ను నిర్మించడం జరిగింది. బిగ్‌బాస్‌ ఇల్లుతో పాటు, బిగ్‌బాస్‌ స్టేజ్‌ మొత్తం కలిపి అన్నపూర్ణ స్టూడియోలోనే నిర్మించడం జరిగింది. స్టార్‌ మాటీవీతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా నాగార్జున ఈ ఒప్పందంను కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇందుకోసం నాగార్జున భారీ మొత్తంలోనే ఛార్జ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Bigg Boss 2 House Rent 5 Lakhs For One Day-

Telugu Bigg Boss 2 House Rent 5 Lakhs For One Day

బిగ్‌బాస్‌ షో కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్‌ను నిర్మించడం జరిగింది. ఆ సెట్‌ నిర్మించినందుకు గాను ప్రతి రోజు అయిదు లక్షల రూపాయలు అన్నపూర్ణ స్టూడియోకు చెల్లించేలా బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. షో వంద రోజుల కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. షో పూర్తి అయిన తర్వాత సెట్‌ను తొలగించే అవకాశం ఉంది. ఈ షో నిర్వాహణకు అన్నపూర్ణ స్టూడియోకు భారీగా ఖర్చు అవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇక షో మూడవ మరియు నాల్గవ సీజన్‌ల సెట్‌ను కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే వేసేందుకు ఒప్పందం కుదిరింది.

మొత్తం మూడు సీజన్‌లకు గాను షో నిర్వాహకులు అన్నపూర్ణ స్టూడియోతో ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదరాబాద్‌కు దూరంగా అయితే బాగుండదనే ఉద్దేశ్యంతో నగరం నడిబొడ్డున ఉన్న అన్నపూర్ణ స్టూడియో అయితేనే బాగుంటుందని ఫిక్స్‌ అయ్యి తర్వాత సీజన్‌లకు కూడా అన్నపూర్ణ స్టూడియోతో ఒప్పందం చేసుకోవడం మంచి పరిణామంగా ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక హోస్ట్‌ విషయంలో కూడా ఇలాంటి ఒప్పందం ఏదైనా జరిగిందా అంటూ చర్చ జరుగుతుంది.

Telugu Bigg Boss 2 House Rent 5 Lakhs For One Day-

మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా, రెండవ సీజన్‌కు ఆయన బిజీ షెడ్యూల్‌ కారణంగా నో చెప్పాడు. దాంతో రెండవ షెడ్యూల్‌కు నానిని తీసుకున్నారు. ఈ సమయంలోనే నానితో వరుసగా మూడు సీజన్‌లకు అంటే రెండు, మూడు, నాలుగు సీజన్‌లకు హోస్ట్‌గా వ్యవహరించేలా ఒప్పందం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే కొందరు మాత్రం ఎప్పుడైనా ఒక్క సీజన్‌కే ఒప్పందం ఉంటుందని, మూడవ సీజన్‌కు నాని లేదంటే మరెవ్వరైనా చేసే అవకాశం ఉందని అంటున్నారు.