టీడీపీ కి పవన్ భయం పట్టుకుందా .. ఆ ఓట్లకు గండి కొట్టబోతున్నాడా   TDP Fears With Pawan JanaSena     2018-09-04   09:12:30  IST  Sai M

ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడే .. అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి టీడీపీకి లాభం చేకూరుస్తాడని ఆశించిన ఆ పార్టీకి పవన్ నిరాశ మిగిల్చే ఛాన్స్ కనిపిస్తోంది. అసలు జనసేన ఎన్నికల బరిలోకి దిగడం వెనక చంద్రబాబు వ్యూహం ఉందని, ఆయనే పవన్ ని రంగంలోకి దించి వైసీపీకి దేబకొట్టబోతున్నాడు అని రకరకాల వార్తలు వినిపించాయి. అయితే పవన్ ఎఫెక్ట్ టీడీపీ కి కూడా గట్టిగా తగలబోతున్నట్టు కొన్ని సర్వేల్లో తేలడంతో ఇప్పుడు టీడీపీ ఆలోచనలో పడింది.

జనసేన ఇప్పుడు కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీని కలవరపెడుతూ ఉంది. ప్రత్యేకించి రాయలసీమ.. ఈ నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా పవన్ కల్యాణ్ పార్టీ తెలుగుదేశం పార్టీని భయపెడుతూ ఉంది. జనసేన పూర్తి స్థాయిలో పోటీ చేస్తే, తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుకు గండి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అర్ధం అవుతోంది. ఈ ఆరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకులో బీసీ లే కీలకం. వీరిలో కూడా కాంగ్రెస్ వ్యతిరేకతతో టీడీపీకి ఓటు వేసే వాళ్లు, సినిమా హీరోల పార్టీగా టీడీపీకి ఓటేసేవాళ్లు కొంతమంది ఉంటారు. అలాగే బలిజల ఓట్లు మెజారిటీ వాటా తెలుగుదేశం పార్టీకే పడుతూ ఉంటాయి.

గతంలో ప్రజారాజ్యం పార్టీ పోటీకి వచ్చినప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు చిరు వైపుకు వెళ్లింది. టీడీపీని గట్టిగా దెబ్బతీసింది. ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అన్నలాగా ప్రభావం చూపిస్తే టీడీపీకి దెబ్బపడే అవకాశం ఎక్కువ. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీ కి మద్దతుగా ప్రచారం చెయ్యడంతో చాలా మంది ఓటేశారు. వారే టీడీపీ విజయాన్ని సులభం చేశారు. ఇప్పుడు పవన్ టీడీపీ వెంట లేకపోగా సొంత కుంపటి పెడుతూ ఉండటం గ్రేటర్ రాయలసీమ పరిధిలో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మరీ అవకాశం కనిపిస్తోంది. పిల్లిపోరు పిల్లిపోరు లో ఎలుక లాభపడినట్టు ఈ పరిణామాలు వైసీపీకి బాగా కలిసొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.