అట్లాంటాలో...తానా ..5k వాక్...సక్సెస్  

అమెరికాలో తెలుగు సంఘం తానా తన ఆధ్వర్యంలో నిర్వహించిన 5k వాక్ రన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది..సొంత ఊరి కోసం అక్కడ ఇబందులు పడుతున్న ఊరి ప్రజలకోసం తలపెట్టిన ఈ కార్యక్రమానికి సభ్యుల నుంచీ విశేష స్పందన లభించింది…ఈ కార్యక్రమంలో సుమారు 300 మందికి పైగా పాల్గొన్నారు…ఈ వాక్ లో పేర్లు నమోదు చేసుకున్న వారికి టీషర్ట్స్ ఇవ్వడంతో కార్యక్రమం మొదలైంది. ముందుగా బాంబే జామ్ డాన్స్ టీం నుంచి, త్రిపుర నుంచి ఎనర్జిటిక్ నృత్యాలతో డాన్స్ చేయించారు..

TANA 5k Run Success At Atlanta-

TANA 5k Run Success At Atlanta

ఆ తరువాత చిన్న పిల్లలకోసం ఏర్పాటుచేసిన 1కే వాక్‌ను మొదలుపెట్టడంతో..అందరూ ఎంతో సంతోషంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు..పిల్లలు అందరిని ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేశారు..తర్వాత పెద్దల కోసం ఏర్పాటు చేసిన 5కే వాక్‌లో వయస్సుతో సంబంధం లేకుండా అందరూ పోటాపోటీగా పాల్గొన్నారు…తదనంతరం బాలలు, మహిళలు మరియు పురుషుల విభాగాలలో మొదటి పదిమంది విజేతలకు అట్లాంటా పెద్దల చేతుల మీదుగా మెడల్స్ మరియు గిఫ్ట్ కార్డ్స్ అందించారు.

TANA 5k Run Success At Atlanta-

అయితే సేవతో పాటుగా ఆరోగ్య పరంగా కూడా ఈ వాక్ ఉపయోగపడుతుందని అందరూ ఈ వాక్ లో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు… తానా కార్యవర్గ సభ్యులు భరత్ మద్దినేని, వినయ్ మద్దినేని, అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్ లావు, అనిల్ యలమంచిలి, మురళి బొడ్డు, రాజు మందపాటి, నగేష్ దొడ్డాక, వెంకీ గద్దె, రామ్ లు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినందుకు సభ్యులు అభినందించారు..