మనుషుల్లో మాత్రమే కాదు..జంతువులు,పక్షుల్లో కూడా స్వలింగసంపర్కం ఉంటుందట.. మొత్తం 1500 రకాల జీవులు..   Swalinga Samparkam Not Only In Man But Also In Living Animals     2018-09-12   11:45:44  IST  Rajakumari K

స్వలింగ సంపర్కం నేరం కాదని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే..తీర్పు పట్ల ఎల్జీబిటి సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తుంటే,కొన్ని మతాలకు చెందిన వారు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.హవ్వ ఇది మన దేశ సంస్కేతేనా అంటూ విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు..ఈ విషయం పక్కన పెడితే..స్వలింగసంపర్కం అనేది కేవలం మనుషులకు సంభందించింది మాత్రమే కాదట…మరి..

మనిషికి తిండి,నిద్ర,గాలి ఎలాగో శృంగారం కూడా అలాంటిదే..కేవలం మనిషికి మాత్రమే కాదు ఈ సృష్టిలో ప్రతి ప్రాణమున్న జీవికి లైంగిక వాంఛలు సహజం..అయితే మగవారు ఆడవారి పట్ల,ఆడవారు మగాళ్ల పట్ల ఆకర్షణకు గురవడం అనేది మనకు తెలుసు..కానీ ఆడ ఆడ,మగ మగ పట్ల ఆకర్షితులవడం,వారితో సెక్స్ చేయడం అనేది సృష్టి విరుధ్దంగా భావిస్తాం..అయితే మనుషుల మాదిరిగా ఇతర జంతువులకు లైంగికవాంఛలు ఏవిధంగా అయితే ఉంటాయో..అదే విధంగా స్వలింగసంపర్కం కూడా జంతువులు,పక్షుల్లోనూ సహజంగా ఉండే లక్షణమట. భూమ్మీద 1500 రకాల జీవులు హోమోసెక్సువాలిటీని కనబరుస్తాయట..

Swalinga Samparkam Not Only In Man But Also Living Animals-

జిరాఫీలు, సింహాలు, గొర్రెలు, బాటిల్ నోస్ డాల్ఫిన్లు, బొనోబోస్ అని పిలిచే చింపాజీలు, అట్లాంటిక్ మొల్లీ ఫిష్ లాంటి చేపలు హోమోసెక్సువాలిటీని ప్రదర్శిస్తాయట.శృంగారానికి ముందు ఫోర్ ప్లే అనేది సహజం.. జిరాఫీలు అయితే శృంగారానికి ముందు గంటల తరబడి ఫోర్ ప్లే చేస్తాయి. ఒకదానితో మెడను మరొకటి తాకుతూ.. సన్నిహితంగా గడుపుతాయట. నీటి గుర్రాలైతే.. పిల్లలు పుట్టడానికి అనువైన సమయంలోనే ఆడవాటితో కలుస్తాయట. మిగతా సందర్భాల్లో మగ నీటి గుర్రాలు మగ వాటితో గడపడానికి, సంభోగించడానికి ఆసక్తి చూపుతాయట.వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం…