తన స్నేహితుడి పేరిట కేరళకు కోటి విరాలం ప్రకటించిన సుశాంత్..     2018-08-23   10:29:05  IST  Rajakumari K

దైవభూమి గా పేరుగాంచిన కేరళ నేడు అందరి సాయం కోసం ఎదురుచూస్తుంది..కేరళని ఆదుకునేందుకు చిన్నా పెద్దా తేడా లేకుండా విదేశీయులు సైతం ముందుకొస్తున్నారు.. ముఖ్యంగా సినీరంగానికి చెందిన వారు ఉదారంగా విరాళాలు అందిస్తూ మాన‌వ‌త్వాన్ని చాటుకుంటున్నారు.అయితే బాలివుడ్ హీరోలు స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో నెగటివ్ గా కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో బాలివుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కోటి విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చాడు..ఈ సాయం అనూహ్యంగా జరగడం విశేషం..

Sushant Singh Rajput Donates One Crore On Behalf Of A Fan-

Sushant Singh Rajput Donates One Crore On Behalf Of A Fan

ఇటీవల శుభం రంజన్ అనే వ్యక్తి సుశాంత్ ని ప్రశ్నిస్తూ ఒక ట్వీట్ చేశాడు.. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే “సుశాంత్,కేరళ బాదితులకు సాయం చేయాలని ఉంది కాని ఎలా చేయాలో తెలియట్లేదు” అంటూ దానికి సుశాంత్ స్పందిస్తూ నీ తరపున నేను సాయం చేస్తానంటూ..ఆ వ్యక్తి పేరిట కోటి రూపాయలు కేరళ వరదబాదితులకు విరాళంగా ప్రకటించాడు..ప్రకటించడమే కాదు విరాళం ఇచ్చి ట్వీట్ చేశాడు సుశాంత్..తాను సాయం చేయడానికి కారణం అయిన శుభం కి ధన్యవాదాలు తెలిపాడు సుశాంత్..

Sushant Singh Rajput Donates One Crore On Behalf Of A Fan-

క్రికెట్ వీరుడు ఎం ఎస్ ధోని బయోపిక్ గా తెరకెక్కిన ” ఎం ఎస్ ధోని ” ది అన్ టోల్డ్ స్టోరీ చిత్రంతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న‌ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ . ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో సుశాంత్ బిజీ స్టార్ అయిపోయాడు.వ‌రుస‌గా మూవీలు చేసుకుంటూ పోతున్నాడు..కేర‌ళ‌లో వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌లం కావ‌డంతో వారికి కోటి రూపాయిలు విరాళం పంపాడు.. ఇంత భారీ మొత్తంలో ఏ న‌టుడు విరాళం ఇవ్వ‌క‌పోవ‌డం విశేషం..