'మీరు ఏం మాట్లాడకండి...వెళ్లి కూర్చోండి'.! నానిపై సుమ సంచలన కామెంట్స్.! పాపం నాని.!   Suma Kanakala Comments On Nani Bigg Boss Show     2018-09-22   08:59:42  IST  Sainath G

‘మీరు ఏం మాట్లాడకండి…వెళ్లి కూర్చోండి’.! నానిపై సుమ సంచలన కామెంట్స్.! పాపం నాని.!

ఛీర్స్ కొట్ట‌కుండా అలా తాగేసావేంట్రా.. దేవ‌దాస్ అంటేనే మ‌న‌కు గుర్తొచ్చేది మందే క‌దా. ఇప్పుడు శ్రీ‌రామ్ ఆదిత్య కూడా దీన్నే ఫాలో అయిపోయాడు. మందుతో పాటు ప్రేమ‌.. బ్రేక‌ప్.. బుల్లెట్స్ అన్నీ క‌లిపి న‌వ్వులు పూయించాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య‌. ఇది దేవదాస్ ట్రైలర్. నాగార్జున, నాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ట్రైలర్, పాటలు ఆడియన్స్ ని ఇప్పటికే ఆకట్టుకున్నాయి. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో వేడుకను గురువారం రాత్రి నిర్వహించారు.

ఇది ఇలా ఉండగా…కౌశల్ పై కామెంట్స్ చేయడంతో బిగ్ బాస్ వల్ల నాని కి కొద్దిగా మైనస్ అయ్యింది. అభిమానులు అతనిపై ఫైర్ అవుతున్నారు. అదే అలుసుగా తీసుకొని…ఆడియో వేడుకను హోస్ట్ చేస్తున్న యాంకర్ సుమ కొద్దిగా ఫన్నీగా అంటూనే కౌంటర్ ఇచ్చారు.

“మీ జీవితం మూడు ట్వీట్ లు ఆరు రీ ట్వీట్లతో కళకళలాడుతుంది. మీరు ఏం మాట్లాడకండి. మీరు ఏం మాట్లాడిన మిమ్స్ అయిపోతున్నాయి” అని కామెంట్ చేసారు. ఆ వీడియో మీరే చూడండి!

Watch Video: