సుమ, రాజీవ్‌లు దత్తత తీసుకున్నారు.. వీరిది ఎంత గొప్ప మనస్సో!   Suma And Rajeev Kanakala In Kerala Floods Helping     2018-09-19   10:25:41  IST  Ramesh P

తెలుగు టాప్‌ యాంకర్‌ సుమ, ఆమె భర్త నటుడు రాజీవ్‌ కనకాల తీసుకున్న నిర్ణయం సినీ వర్గాల వారికి ఆదర్శనీయం అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. భారీ ఎత్తున యాంకర్‌గా గుర్తింపు ఉన్న సుమ తెలుగులో సుదీర్ఘ కాలంగా టాప్‌ యాంకర్‌గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. టాలీవుడ్‌ హీరోయిన్స్‌ కంటే ఎక్కువగా గుర్తింపును దక్కించుకున్న సుమ అప్పుడప్పుడు తన మంచి మనసును కూడా చాటుకుంటూ ఉంటుంది. ఇటీవల సుమ కేరళ వరద బాదితుల సహాయార్థం భారీ మొత్తంలో విరాళం ప్రకటించిన విషయం తెల్సిందే.

తాను పుట్టి పెరిగిన కేరళ వరదల్లో చిక్కుకుని అల్లాడుతున్న సమయంలో సుమ చాలా మనోవేదనకు గురైనట్లుగా అందరికి తెలిసిన విషయమే. కేరళలో వరద బీభత్సంతో వేల కోట్ల నష్టం వాటిల్లింది. దాంతో కేరళ సీఎం ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలంటూ పిలుపు ఇచ్చాడు. తమకు తోచిన మేరకు సాయం చేయాలంటూ ఆయన కోరుతున్నాడు. ఇదే సమయంలో కేరళలో చాలా ముఖ్యమైన అలప్పీ ప్రాంతంలో ఎన్నో భవనాలు నాశనం అయ్యాయి. ఆ భవనాలను దాతలు ముందుకు వచ్చి, బాగు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వం ప్రకటన ప్రకారం అలప్పీలోని ఏదైనా భవనంను ఒకరు దత్తత తీసుకుని, దాన్ని పూర్తిగా బాగు చేయించే అవకాశం ఉంది. ఇలా ప్రకటన రాగానే సుమ దంపతులు వెంటనే అక్కడ ఉండే ఒక ఫ్యామిలీ వెల్ఫేర్‌ బిల్డింగ్‌ను బాగు చేయించేందుకు ముందుకు వచ్చారు. తాము ప్రజలకు ఎంతో అవసరం అయ్యే ఫ్యామిలీ వెల్ఫేర్‌ బిల్డింగ్‌ను రిపేర్‌ చేయిస్తున్నామని, తమకు దత్తత విషయం గురించి చెప్పిన సబ్‌ కలెక్టర్‌ గారికి కృతజ్ఞతలు అంటూ సుమ దంపతులు చెప్పుకొచ్చారు.

Suma And Rajeev Kanakala In Kerala Floods Helping-

సుమ దంపతుల మాదిరిగానే సినిమా పరిశ్రకు చెందిన ప్రముఖులు ఇలా దత్తతకు ముందుకు రావాలని, అలా వచ్చినప్పుడే కేరళ మళ్లీ మునుపటి రూపంకు వస్తుందనే నమ్మకంను అక్కడి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వందల కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయి. వాటితో సహాయక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నట్లుగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది.