మహానటితో గీత గోవిందం కు పోలిక.. అందుకే హిట్‌     2018-08-21   10:26:43  IST  Ramesh Palla

విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. మొదటి అయిదు రోజుల్లో దాదాపుగా 55 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను రాబట్టిన ఈ చిత్రం సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు సినిమా అంటే సహజంగా శుక్రవారం విడుదల అవుతుంది. కాని ఈ చిత్రం మాత్రం బుదవారం విడుదల అయ్యింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా బుదవారం విడుదల అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో మొదటి మూడు రోజులు, ఆ తర్వాత వారాంతం అవ్వడంతో రెండు రోజుల పాటు హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో దుమ్ము రేపింది.

Success Of Geetha Govindam Compared To Savithri-

Success Of Geetha Govindam Compared To Savithri

ఇంతటి సంచలన విజయాన్ని దక్కించుకున్న గీత గోవిందంకు ఆమద్య వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసిన మహానటికి మూడు పోలికలు ఉన్నాయి. ఆ మూడు పోలికల్లో కీలకమైనది ఈ రెండు చిత్రాలకు థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల చేయలేదు. మహానటి చిత్రం కథ రివీల్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో ట్రైలర్‌ను వదలకుండా టీజర్‌తోనే సరిపెట్టారు. తాజాగా గీత గోవిందం విషయంలో కూడా కొన్ని కారణాల వల్ల ట్రైలర్‌ను విడుదల చేయకుండా కేవలం టీజర్‌తోనే ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. టీజర్‌తోనే గీత గోవిందం స్థాయి పెరిగింది. అందుకే మళ్లీ ట్రైలర్‌ ఎందుకులే అనుకున్నారో ఏమో.

ఇక ‘మహానటి’ చిత్రం బుధవారం విడుదల కాగా, గీత గోవిందం కూడా బుధవారం నాడే విడుదల అయ్యింది. ఈ రెండు చిత్రాలు టాలీవుడ్‌ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేసి మరీ విడుదల అవ్వడం చర్చనీయాంశం అయ్యింది. శుక్రవారం లేదా గురువారం విడుదల అయ్యే తెలుగు సినిమాలు బుదవారం విడుదల అవ్వడం అంటే సాహస నిర్ణయం. ఈ రెండు చిత్రాలు కూడా పెద్ద సాహసంకు పూనుకున్నాయి. అయితే రెండు కూడా భారీ విజయాన్ని నమోదు చేశాయి.

Success Of Geetha Govindam Compared To Savithri-

గీత గోవిందం చిత్రంలో హీరోగా నటించిన విజయ్‌ దేవరకొండ ‘మహానటి’లో ఒక ముఖ్యమైన గెస్ట్‌ పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. మహానటి మరియు గీత గోవిందంలో విజయ్‌ దేవరకొండ ఉండటం, ఈ రెండు చిత్రాలు బ్లాక్‌ బస్టర్‌ అవ్వడం కాకతాళియం అయినా కూడా ప్రేక్షకులు మాత్రం విజయ్‌ దేరకొండను స్టార్‌ అనేస్తున్నారు. మొత్తానికి గీత గోవిందం ‘మహానటి’ని దాటేయడం ఖాయంగా కనిపిస్తుంది.