హాల్ టికెట్ పై అమితాబ్ ఫోటో చూసి ఆశ్చర్యం లో స్టూడెంట్..   Student Get Hall Ticket With Amitabh Bachchan Photo     2018-09-05   13:12:47  IST  Rajakumari K

హీరో అమితాబ్‌ అంటే ఎంత ఇష్టముంటే మాత్రం ఏకంగా హాల్ టికెట్ పై ముద్రించేస్తారా? యూపీలో వెలుగుచూసిన వింత ఘటనలో ఓ స్టూడెంట్‌కి జారీ చేసిన హాల్ టికెట్‌లో అమితాబ్ ఫోటోని ముద్రించి ఇచ్చింది డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా అవధ్ యూనివర్శిటీ.అడ్మిట్ కార్డుపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఫోటో దర్శనమివ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

గొండా జిల్లాలోని రవీంద్ర సింగ్ స్మారక్ మహా విద్యాలయలో అమిత్ ద్వివేది బీఈడీ చదువుతున్నాడు. ఈ కాలేజీ ఫైజాబాద్‌లోని డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా అనుబంధంగా ఉంది. తన సెకండియర్ పరీక్షలకు సంబంధించి.. అమిత్ ఈ మధ్యే అప్లికేషన్ పూర్తి చేశాడు. కొద్దిరోజుల తర్వాత అడ్మిట్ కార్డు ఇంటికి వచ్చింది.అడ్మిట్ కార్డు చూడగానే షాకైన ద్వివేది.. తన ఫోటో బదులు అమితాబ్ ఫోటో ఉండటంతో కంగుతిన్నాడు. జరిగిన తప్పును వెంటనే కాలేజీ, యూనివర్శిటీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాడు. అయినా కొన్ని డాక్యుమెంట్లను సమర్పిస్తే తప్ప.. అతడ్ని పరీక్షకు అనుమతించలేదు. పరీక్షల మాట అటుంచితే.. తన మార్కుల లిస్ట్‌లో కూడా అమితాబ్ ఫోటో వస్తుందేమోనని కంగారుపడుతున్నాడు అమిత్. యూనివర్శిటీ అధికారులు స్పందించి.. ఈ తప్పును సరిదిద్దాలని కోరుతున్నాడు. పరీక్షలకు సంబంధించిన అప్లికేషన్‌లో తన ఫోటోనే ఉందని.. పొరపాటు ఎక్కడ జరిగిందో అర్థం కావడం లేదంటున్నాడు.

Student Get Hall Ticket With Amitabh Bachchan Photo-

మరోవైపు కాలేజీ సిబ్బంది మాత్రం ఈ పొరపాటు విద్యార్థిదే అంటున్నారు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పూర్తి చేసే సమయంలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అంతేకాదు యూనివర్శిటీలో కూడా పొరపాటు జరిగే అవకాశం లేకపోలేదంటున్నారు. మార్కుల లిస్ట్‌లో మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా వర్శిటీ అధికారులకు లేఖ

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.