నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్న ఫోటో.. ఓల్డేజ్ హోం ట్రిప్లో నాన్నమ్మని కలిసిన అమ్మాయి..     2018-08-23   09:45:22  IST  Sai Mallula

ఇటీవల ఒక స్కూల్ యాజమాన్యం విధ్యార్దులను ఓల్డేజ్ హోం ట్రిప్ కి తీసుకెల్లారు..ఆ సంధర్బంలో ఓల్డేజ్ హోంలో తన నాన్నమ్మను చూసి భావేద్వోగానికి గురైంది ఓ విద్యార్ధిని.. సోషల్ మీడియాలో వైరలైన నాన్నమ్మ,మనవరాలి ఫోటో అందరిని కళ్లనీళ్లు పెట్టిస్తుంది..ప్రస్తుతం సొసైటి పరిస్తితిని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది…

స్కూల్ ట్రిప్లో భాగంగా వెళ్లిన విధ్యార్ధిని అక్కడ తన గ్రాండ్‌మాను చూసి కన్నీరుమున్నీరు అయింది. ఇది చూస్తుంటే ఎవరి కళ్లైనా చెమర్చుతాయి.రెండేళ్ల తర్వాత తన నాన్నమ్మను చూసింది ఆ అమ్మాయి.అంతకాలం పాటు తన పేరెంట్స్ నాన్నమ్మ ఎక్కడ అని అడిగితే రిలేటివ్స్ ఇంటికి వెళ్లిందని చెప్తుండేవారని చెప్పుకొచ్చింది..

Story Behind The Viral Grandmother-granddaughter Photo-

Story Behind The Viral Grandmother-granddaughter Photo

ప్రస్తుతం ఎంతోమంది తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు..ఒక్కొక్కరిది ఒక్కో కథ..ఉద్యోగరిత్యా ఎక్కడో ఉండడం చేత తల్లిదండ్రులను చేర్పించేవారు కొందరైతే,తల్లిదండ్రులను భారంగా భావించి వృధ్దాశ్రమాల్లో చేర్పించేవారు కొందరు..అమ్మాయి చెప్తున్నదాన్ని బట్టి చూస్తే వీరు రెండో కోవకి చెందిన వారనిపిస్తుంది..ఒక్కసారి ఆలోచించండి పిల్లలే భారం అనుకుని తల్లిదండ్రులు మిమ్మల్నికనడమే మానేస్తే..