శ్రీనివాస కళ్యాణం ఫలితం ఏంటీ? సేఫ్‌ అయినట్లేనా?  

నితిన్‌ హీరోగా రాశిఖన్నా హీరోయిన్‌గా సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. భారీ అంచనాల నడుమ తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది. దిల్‌రాజు ఇలాంటి కథతో ఎలా సినిమాను చేశాడు అంటూ అంతా నోరెళ్లబెడుతున్నారు. పెళ్లి కాన్సెప్ట్‌ను తీసుకుని, దాని చుట్టు అల్లిన కథ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. దర్శకుడు సతీష్‌ వేగేశ్న స్క్రీన్‌ప్లేలో కూడా మెప్పించలేక పోయాడు.

సినిమా నెగటివ్‌ టాక్‌ తెచ్చుకున్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. ఈ చిత్రంను 20 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మాత దిల్‌రాజు తెరకెక్కించాడు. సినిమా విడుదలకు ముందే ఈ చిత్రం బడ్జెట్‌ను రికవరీ చేసేలా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. ఇక సినిమాపై అంచనాలు భారీగా పెరగడంతో అంతా కూడా ఈ సినిమాను చూడాలని భావించారు. అందుకే నెగటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మంచి ఓపెనింగ్స్‌ను ఈ చిత్రం దక్కించుకుంది.

Srinivasa Kalyanam Movie Collections Profit Are Loss-

Srinivasa Kalyanam Movie Collections Profit Are Loss

ఈ చిత్రం మొదటి నాలుగు రోజుల్లో 8.6 కోట్ల షేర్‌ను దక్కించుకుంది. లాంగ్‌రన్‌లో ఖచ్చితంగా 10 కోట్లను క్రాస్‌ చేస్తుంది. అదే కనుక జరిగితే డిస్ట్రిబ్యూటర్లు కూడా దాదాపు సేఫ్‌ అయినట్లే అంటూ ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ఇక శాటిలైట్‌ రైట్స్‌, ఆన్‌లైన్‌ రైట్స్‌ ఇతరత్ర రైట్స్‌తో నిర్మాత దిల్‌రాజు లోటును భర్తీ చేస్తున్నాడు. మొత్తానికి నితిన్‌ సినిమా ఫలితం తేడా కొట్టినా కూడా కలెక్షన్స్‌ పరంగా మాత్రం సేఫ్‌ అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొంది, ప్రేక్షకుల ముందుకు వచ్చింది కనుక భారీ ఓపెనింగ్స్‌ దక్కాయి.

ఆ కారణంగా సినిమా డిస్ట్రిబ్యూటర్లు మరియు నిర్మాత సేఫ్‌ అయ్యారు అని చెప్పుకోవచ్చు. రేపు ‘గీత గోవిందం’ చిత్రం రాబోతున్న కారణంగా శ్రీనివాస కళ్యాణం కలెక్షన్స్‌ పూర్తిగా డ్రాప్‌ అయ్యే అవకాశం ఉంది. అయినా కూడా పర్వాలేదు అంటూ దిల్‌రాజు వర్గాల వారు అంటున్నారు.