ఆ మూవీ ఫ్లాప్‌ అంటే దిల్‌రాజు ఒప్పుకోవడం లేదు     2018-08-15   12:00:36  IST  Ramesh Palla

స్టార్‌ నిర్మాత దిల్‌రాజు తాజాగా ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నితిన్‌, రాశిఖన్నా జంటగా తెరకెక్కిన ఈ చిత్రంకు సతీష్‌ వేగేశ్న దర్శకత్వం వహించాడు. సినిమా ఆరంభం నుండి కూడా అంచనాలు అమాంతం పెరిగాయి. గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శతమానంభవతి’ చిత్రం తరహాలోనే ఈ చిత్రం ఉంటుందని అంతా కూడా భావించారు. దిల్‌రాజు ప్రచారం మరియు పబ్లిసిటీ కూడా అదే తరహాలో చేశాడు. కాని సినిమా ఫలితం బెడిసి కొట్టింది.

Srinivasa Kalyanam Flop Movie But Dil Raju Don't Believe It-

Srinivasa Kalyanam Flop Movie But Dil Raju Don't Believe It

సినిమాలో పెళ్లి తంతు తప్ప మిగిలినవి ఏమీ ఆకట్టుకోలేదు అని, ఏంత మాత్రం సినిమా మెప్పించలేక పోయింది అంటూ విశ్లేషకులు రివ్యూలు ఇచ్చేశారు. ప్రేక్షకులు కూడా సినిమాపై పెదవి విరిచారు. దాంతో సినిమాకు కలెక్షన్స్‌ ఆశించిన స్థాయిలో రావడం లేదు. మొదటి మూడు రోజులు కాస్త పర్వాలేదు అనిపించినా, సోమవారం నుండి మాత్రం కలెక్షన్స్‌ పూర్తిగా డ్రాప్‌ అయ్యాయి. తాజాగా గీత గోవిందం చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో సినిమాను కొన్ని థియేటర్ల నుండి తొలగించడం జరిగింది.

శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్‌ అని తేలిపోయినా కూడా నిర్మాత దిల్‌రాజు మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. సినిమా బాగా ఆడుతుందని, ప్రేక్షకులు కన్ఫ్యూజ్‌ అవుతున్నారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకుల అభిప్రాయం నేరుగా తెలుసుకునేందుకు సినిమాకు వారితోనే రేటింగ్‌ ఇప్పించేందుకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు వంద థియేటర్లలో కార్డులు పంచిపెట్టబోతున్నారు. సినిమా ఫలితం ఏంటీ అనే విషయాన్ని వారు చెప్పాల్సి ఉంటుంది. ఆ విధంగా సినిమాను సక్సెస్‌ అంటూ టాక్‌ తెచ్చుకోవాలని దిల్‌రాజు భావిస్తున్నాడు.

Srinivasa Kalyanam Flop Movie But Dil Raju Don't Believe It-

మొత్తానికి దిల్‌రాజు ఫ్లాప్‌ అయిన శ్రీనివాస కళ్యాణంను హిట్‌ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని అది సాధ్యం అవ్వడం దాదాపు అసాధ్యం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. దిల్‌రాజు ఏమైనా ఫలితాన్ని సాధిస్తాడో చూడాలి. శ్రీనివాస కళ్యాణం సక్సెస్‌ అయ్యింది కనుక అదే దర్శకుడు సతీష్‌ వేగేశ్నతో కలిసి మరో సినిమాను చేయబోతున్నాను అని, ఆ సినిమాకు ‘థ్యాంక్యూ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా దిల్‌రాజు ప్రకటించాడు.