శ్రీరెడ్డి బూతులకు హద్దు లేకుండా పోతుంది... ఈసారి సచిన్‌పై ఆరోపణలు..   Sri Reddy Comments On Cricket God Sachin Tendulkar     2018-09-11   10:31:21  IST  Ramesh P

కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఆమద్య పెద్ద ఉద్యమమే చేసిన విషయం తెల్సిందే. శ్రీరెడ్డి ఆరోపణలు తెలుగు స్టార్స్‌ను నిద్ర లేకుండా చేశాయి. ఎంతో మంది స్టార్స్‌కు నిద్ర లేని రాత్రులు మిగిలేలా చేసిన శ్రీరెడ్డి తన లీక్స్‌ను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా తమిళనాట మురుగదాస్‌, హీరో శ్రీరామ్‌, లారెన్స్‌లపై సంచలన ఆరోపణలు చేసింది. అదే సమయంలో తమిళనాట శ్రీరెడ్డి సినిమా ఛాన్స్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం ‘రెడీడైరీ’ అనే చిత్రాన్ని తమిళంలో చేస్తున్న ఈమె తాజాగా తన ఆరోపణలను కంటిన్యూ చేస్తూనే ఉంది.

ఇప్పటి వరకు సినీ ప్రముఖులను టార్గెట్‌ చేసిన శ్రీరెడ్డి ఈసారి క్రికెట్‌ దేవుడిగా పేరున్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. సచిన్‌ టెండూల్కర్‌ హైదరాబాద్‌ వచ్చిన సమయంలో ఛార్మీతో రొమాంటిక్‌ టైంను ఎంజాయ్‌ చేశాడని, ఇండస్ట్రీలో ఆ విషయం చాలా మందికి తెలుసని, సచిన్‌ వద్దకు ఛార్మీని ప్రముఖ వ్యక్తి ఛాముండేశ్వరినాధ్‌ పంపించాడు అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. రొమాంటిక్‌ ఆటలో సచిన్‌ మంచి ప్రతిభ కనబర్చాడట అని కూడా శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడం చర్చనీయాంశం అయ్యింది.

ఇప్పటి వరకు ఎంతో మంది సెలబ్రెటీలను కామెంట్‌ చేసిన శ్రీరెడ్డి ఈసారి క్రికెట్‌ దేవుడిపై చేసిన వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. నీచమైన వ్యాఖ్యలు చేస్తూ, హద్దు పద్దు లేకుండా బూతులు మాట్లాడుతున్న శ్రీరెడ్డిని ఏం చేసినా తప్పు లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరెడ్డి ఆరోపణల విషయంలో సచిన్‌ స్పందించే ఛాన్స్‌ లేదు. ఛాంముండేశ్వరినాథ్‌ పెద్దగా ఈ విషయాలను పట్టించుకోడు. మరి ఛార్మి ఈ విషయంపై ఎలా రియాక్ట్‌ అవుతుందనేది చూడాలి.

Sri Reddy Comments On Cricket God Sachin Tendulkar-

శ్రీరెడ్డి సినిమాతో బిజీ అయిన తర్వాత కాస్త సైలెంట్‌ అవుతుందని అంతా భావించారు. కాని ఆమె మాత్రం సైలెంట్‌ కాదు కదా, మరీ వైలెంట్‌గా వ్యాఖ్యలు చేస్తుంది. శ్రీరెడ్డి చేస్తున్న ఈలీక్స్‌ లో మరెంత మంది ఉంటారో అంటూ సినీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరెడ్డి పై కేసులు నమోదు అయినా ఇలాంటి వ్యాఖ్యలను మాత్రం మానుకోవడం లేదు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.