మాట మార్చిన శ్రీరెడ్డి.. వామ్మో నువ్వు తక్కువ దానివి కాదుగా!     2018-08-25   10:01:51  IST  Ramesh Palla

తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులను వణికించిన శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమలో సెటిల్‌ అయ్యింది. ఇటీవలే ఈమె తాను చెన్నైకు మకాం మార్చినట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. చెన్నైలోనే ఇకపై ఉండబోతున్నట్లుగా చెప్పిన శ్రీరెడ్డి తమిళంలో వరుసగా చిత్రాలు చేస్తాను అంటూ ప్రకటించింది. తమిళంలో ఈమె మొదటి చిత్రం ‘రెడీ డైరీ’. ఈ చిత్రంను మొదట తన బయోపిక్‌ అంటూ ప్రచారం చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు మాట మార్చింది. రెడీ డైరీ చిత్రం తన బయోపిక్‌ అంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, తన మాటలు వక్రీకరించి మీడియాలో ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Sri Reddy Back Step On Her Biopic-

Sri Reddy Back Step On Her Biopic

శ్రీరెడ్డి బయోపిక్‌ విషయంపై క్లారిటీ రావడంతో కొందరు టాలీవుడ్‌ ప్రముఖులు ఊపిరి ప్చీుకుంటున్నారు. కోలీవుడ్‌లో తెరకెక్కబోతున్న రెడీ డైరీ ఒక తమిళ నటికి సంబంధించిన స్టోరీ అంటూ చెప్పుకొచ్చింది. పోలీస్‌ ఆఫీసర్‌గా శ్రీరెడ్డి ఈ చిత్రంలో నటించబోతుంది. శ్రీరెడ్డి పవర్‌ ఫుల్‌ పోలీస్‌గా కనిపించి మెప్పించేందుకు సిద్దం అయ్యింది. రెడీ డైరీ తర్వాత కూడా శ్రీరెడ్డి రెండు మూడు చిత్రాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక శ్రీరెడ్డి తన బయోపిక్‌ గురించి స్పందిస్తూ తన బయోపిక్‌ ఒక్క సినిమాగా చేయడం సాధ్యం కాదని, కనీసం మూడు నాలుగు పార్ట్‌ు అయినా చేయాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది.

బయోపిక్‌ విషయంలో శ్రీరెడ్డి వెనకడుగు వేయడంతో ఆమెతో సంబంధం ఉన్న వారు, ఆమెను మోసం చేసిన వారు కాస్త ఆందోళన చెందుతున్నారు. బయోపిక్‌లో శ్రీరెడ్డి పలు విషయాలను మరియు వీడియోలను బయట పెడతాను అంటూ అప్పుడు చెప్పింది. దాంతో పలువురి విషయాలు బయటకు వస్తాయని అంతా భావించారు.

Sri Reddy Back Step On Her Biopic-

తాజాగా బయోపిక్‌ కాదంటూ చెప్పడంతో వారంత కాస్త ఊపిరి పీల్చుకున్నారు. శ్రీరెడ్డి మాట మార్చి, బయోపిక్‌ విషయంలో తన నిర్ణయాన్ని వెళ్లడిరచి వామ్మో శ్రీ తక్కువది కాదు అనిపించుకుంది. తమిళ పరిశ్రమ దృష్టిని ఆకర్షించేందుకు ఈమె ఇంకా పలు ఆరోపణలు చేస్తూ ఉంది. గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి టాలీవుడ్‌ స్టార్స్‌ను టార్గెట్‌ చేయడం తగ్గించింది. అయితే శ్రీరెడ్డి ఎప్పుడు బ్లాస్ట్‌ అవుతుందో అని కొందరు భయపడుతూనే ఉన్నారు.