మా లో విభేదాల కారణంగా కోట్లు నష్టం... ఎలాగో తెలుసా   Some Crores Lose In MAA About Allegations     2018-09-07   12:10:01  IST  Ramesh P

మా లో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇన్నాళ్లు చాపకింద నీరులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్న కారణంగా సినిమా ఇండస్ట్రీ పరువు పోయింది. మా అధ్యక్షుడు శివాజీ రాజా మరియు ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌లు పెద్ద ఎత్తున నిధులను దారి మళ్లించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలోనే మా లో కీలక వ్యక్తి అయిన నరేష్‌ స్వయంగా మీడియా ముందుకు వచ్చిన నిధుల దారి మళ్లీంపు నిజమే అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. శివాజీ రాజాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. కోట్ల రూపాయలు గోల్‌ మాల్‌ జరుగుతున్న కారణంగా నిజ నిర్థారణ కమిటీ వేసి తీరాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నాడు.

మా సిల్వర్‌ జూబ్లీ వేడుకల సందర్బంగా చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్‌, నాగార్జున వంటి స్టార్స్‌తో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఫండ్స్‌ను రైజ్‌ చేయాలని భావించారు. చిరంజీవి తో ఇప్పటికే కార్యక్రమంను నిర్వహించారు. ఆ కార్యక్రమం ద్వారా కోటి రూపాయలు వచ్చాయి. అయితే రెండు కోట్ల రూపాయలు రాగా కోటి మాత్రమే వచ్చినట్లుగా చెబుతున్నారు అంటూ నరేష్‌ ఆరోపిస్తున్నాడు. ఇలాంటి సమయంలోనే ప్రభాస్‌ మరియు మహేష్‌బాబులు ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమంకు హాజరు అవుతాడా లేదా అనేది అనుమానాలను రేకెత్తిస్తున్నారు.

మహేష్‌బాబుతో ఇప్పటికే కార్యక్రమం ప్లాన్‌ చేశారు. కాని నరేష్‌ చేస్తున్న ఆరోపణల కారణంగా సదరు కార్యక్రమంను క్యాన్సిల్‌ చేసుకోవాలని మహేష్‌బాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే మా కు పెద్ద నష్టం తప్పదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఫండ్‌ రైజింగ్‌ ద్వారా అయిదు కోట్ల వరకు రాబట్టాలని ప్రయత్నించిన మా పెద్దలకు ఈ వివాదం పెద్ద తలనొప్పిని తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

Some Crores Lose In MAA About Allegations-

ఇప్పుడు మా సభ్యులు ఏం చేసినా కూడా అవినీతి కోణంలోనే జనాలు చూసే అవకాశం ఉంది. దాంతో ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాలు రద్దు చేసే అవకాశం ఉంది. మాలో విభేదాల వల్ల కోట్ల నష్టాలు వస్తాయని ఇప్పటికే సినీ వర్గాల వారు ఆందోళన చెందుతున్నారు. ప్రతిష్టాత్మక సిల్వర్‌ జూబ్లీ వేడుకలను ఇలా గందరగోళం చేయడంతో మా సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.