అసలు విషయాన్ని దాచి పెళ్లిచేసుకున్నాడు...ఫస్ట్ నైట్ రోజు ఎంత పని చేసాడో తెలుసా.?   Software Machani Rajendra Prasad Harassment Wife Kamurti Triveni     2018-09-05   11:24:13  IST  Sainath G

దగ్గరి బంధువు, పైగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్, ఆకర్షణీయమైన జీతం…ఈ మూడింటిపై ముచ్చటపడి మరో ఆలోచన చేయకుండా పెళ్లికి ఒప్పేసుకున్నాడు ఓ తండ్రి. పెళ్లయి ఒక రోజు గడవక ముందే భార్యకు నరకం చూపించాడో భర్త. భర్త నపుంసకుడని తొలి రాత్రే భార్యకు తెలిసింది. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించిన ఆయన.. ఆమె నగ్న ఫొటోలు తీసి హింసించడం మొదలు పెట్టాడు.కొన్నాళ్లు టార్చర్ భరించిన బాధితురాలు విషయం అత్త చెవిలో వేసింది. అయితే.. కొడుకు చేసిన పనికి సిగ్గుపడాల్సిన అత్త.. కోడలినే వదిలించుకోవాలనుకుంది. అందరూ కలిసి చివరకు నవ వధువుకు టీబీ రోగం అంటగట్టారు. తమ కొడుకుకు రెండో పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డారు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది. కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే…

అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన త్రివేణి అనే యువతికి కర్నూలు జిల్లాకు చెందిన మాచాని రాజేంద్రప్రసాద్‌తో గత యేడాది ఆగస్టులో వివాహమైంది. అల్లుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడంతో రూ.55 లక్షల కట్నమిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. అయితే పెళ్లయి 24 గంటలు గడవకముందే శాడిస్ట్ మొగుడు నుంచి వేధింపులు మొదలయ్యాయి. ముఖ్యంగా శోభనం రోజు రాత్రి తనలోని లోపాన్ని భార్యకు చెప్పిన రాజేంద్రప్రసాద్ తనకు అన్ని విధాలుగా సహకరించాలని కోరాడు. దీంతో కొంతకాలం పాటు ఆమె ఈ గుట్టును బయటకు చెప్పలేదు.

Software Machani Rajendra Prasad Harassment Wife Kamurti Triveni-

ఫస్ట్ నైట్ రోజు తీసిన న్యూడ్ ఫోటోలు, వీడియోలను అడ్డంపెట్టుకుని… భయపెట్టడమే కాకుండా అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు. కూతురి సంసారం బాగు కోసం బాధితురాలి తండ్రి, అల్లుడికి పది లక్షల రూపాయలు రెండు విడతలుగా ఇచ్చేశాడు. కొద్ది రోజులకు పిల్లలు కలగక పోవడంతో అత్త నిలదీసింది. భర్త లోపాన్ని బాధితురాలు అత్తకు తెలియజేసింది.

అయితే.. కొడుకు చేసిన పనికి సిగ్గుపడాల్సిన అత్త.. కోడలినే వదిలించుకోవాలనుకుంది. అప్పటికే అన్నింటికీ సిద్ధపడ్డ రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులు త్రివేణికి టీబీ ఉందని, ఆ విషయం దాచి పెళ్లి చేసి.. తన కొడుకు జీవితాన్ని నాశనం చేశారని కొత్త నాటకానికి తెరలేపారు. అయితే త్రివేణిపై పడ్డ నిందను చెరిపేందుకు కర్నూలు అపోలోకి ఆమెను తీసుకెళ్లి.. వైద్య పరీక్షలు చేయించి.. టీబీ లేదని రిపోర్ట్‌లు కూడా తీసుకొచ్చారు. తమ కొడుకుకు రెండో పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డారు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.