జుట్టు మెరుస్తూ కాంతివంతంగా మారాలంటే...అద్భుతమైన పాక్స్  

జుట్టు అందంగా,పొడవుగా,మెరుస్తూ ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జిడ్డు డల్ గా పొడిగా మారుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా జుట్టు కాంతివంతంగా మారాలంటే ఈ పాక్స్ ట్రై చేయండి.

Simple Ways To Make Hair Silky-

Simple Ways To Make Hair Silky

కొబ్బరి పాలు మరియు రోజ్ మేరీ
ఒక కప్పు కొబ్బరి పాలలో మూడు స్పూన్ల రోజ్ మేరీ, ఒక క్యాప్సిల్ విటమిన్ E ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా వేడి చేసి తలకు రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. షవర్ క్యాప్ పెట్టుకొని పడుకొని,మరుసటి రోజు ఉదయం తలస్నానము చేస్తే జుట్టు మృదువుగా కాంతివంతంగా మారుతుంది. కొబ్బరి పాలలో ఉండే మాయిశ్చరైజర్ లక్షణాలు జుట్టును బలంగా మార్చటమే కాకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది.

ఆముదం మరియు ఆలివ్ ఆయిల్
ఆముదం మరియు ఆలివ్ ఆయిల్ రెండింటిని సమాన భాగాలుగా తీసుకోని బాగా కలపాలి. రాత్రి పడుకొనే ముందు తలకు రాసి మరుసటి రోజు ఉదయం తలస్నానము చేస్తే జుట్టు సిల్కీ గా ఉంటుంది.

Simple Ways To Make Hair Silky-

మెంతులు మరియు కొబ్బరి నూనె
కొబ్బరి నూనెలో మెంతులను వేసి మరిగించాలి. కాస్త గోరువెచ్చగా అయ్యాక ఆ నూనెను తలకు పట్టించి మరుసటి రోజు ఉదయం తలస్నానము చేయాలి. మెంతులు జుట్టును బలంగా మరియు జుట్టు రాలకుండా సహాయపడుతుంది.