భారత సంతతి సిక్కు సైనికుడి పై..బ్రిటన్ ఆర్మీ వేటు   Sikh Guardsman 'faces Discharge From Army After Testing     2018-09-26   14:33:25  IST  Bhanu C

భారతదేశం నుంచి ఎంతో మంది ఎన్నో దేశాలకి వలసలు వెళ్లి అక్కడ వివిధ రంగాలలో స్థిరపడ్డారు…అంతేకాదు ఏకంగా ఆయా దేశ రక్షణ రంగాలలో రాజకీయ రంగాలలో ఉంటూ విశేష సేవలు అందిస్తున్నారు.ఎంతో ఉన్నత స్థానాలకి చేరుకుంటున్నారు అయితే అత్యధికులు అగ్ర రాజ్యం అమెరికాలో ఉండగా తరువాతి స్థానం బ్రిటన్ ,దుబాయ్ కంట్రీస్ లో ఉంటున్నారు అయితే

కొన్ని నెలల క్రితం చరణ్ ప్రీత్ సింగ్ అనే భారత సంతతి సిక్కు యువకుడు బ్రిటీష్ సైనిక విభాగంలో చేరిన విషయం విధింతమే ఆ సమయంలో అతడి బిర్తాన్ చరిత్రలో మొదటి సారిగా తలపాగా ధరించి మిలటరీ పరేడ్‌లో పాల్గొని రికార్డ్ సృష్టించాడు..రాణి ఎలిజబేత్‌ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో తలపాగా ధరించి పాల్గొన్న ఏకైక సైనికుడిగా వార్తల్లో నిలిచాడు.

Sikh Guardsman 'faces Discharge From Army After Testing-

అయితే అంతగా గుర్తింపు పొందిన చరణ్ ప్రీత్ సింగ్ గత వారం నిర్వహించిన డ్రగ్స్‌ టెస్ట్‌లో ఫెయిల్‌ అయ్యాడు. చరణ్‌ప్రీత్‌ సింగ్‌ ఎక్కువ మోతాదులో కొకైన్‌ తీసుకున్నట్లు ఈ టెస్ట్‌లో తేలీంది. దాంతో త్వరలోనే అతను తన ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది అతడితో పాటు మరో ముగ్గురు సైనికులు డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయ్యింది.