సైమా అవార్డ్‌ సందర్బంగా దుబాయిలో అర్థరాత్రి బాలయ్య ఏం చేశాడో తెలుసా..!   Siima Awards Midnight Dance By Balakrishna Nandamuri     2018-09-18   12:01:22  IST  Ramesh P

ప్రతి సంవత్సరం సౌత్‌ సినీ పరిశ్రమలకు చెందిన వారిని దుబాయిలో అవార్డులు ఇస్తున్న విషయం తెల్సిందే. సైమా అవార్డుల వేడుకలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దుబాయిలో అట్టహాసంగా జరిగింది. భారీ ఎత్తున తారలు దిగివచ్చిన వేళ అద్బుతమైన సినీ వేడుక దుబాయిలో జరిగింది. సైమా వేడుకలో బాలకృష్ణ పాల్గొనడం జరిగింది. బాహుబలి టీంతో పాటు తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఇంకా ఎంతో మంది ఈ అవార్డు వేడుకల్లో పాల్గొన్నా.

గత శని, ఆదివారాల్లో ఈ అవార్డు వేడుక జరిగింది. ఆదివారం అవార్డు వేడుక ముసిగిన తర్వాత సైమా నిర్వాహకులు అన్ని భాషల సెలబ్రెటీలకు భారీ ఎత్తున మిడ్‌ నైట్‌ పార్టీని ఎరేంజ్‌ చేయడం జరిగింది. భారీగా నిర్వహించిన పార్టీ అర్థరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున వరకు కొనసాగినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. సైమా వేడుకల్లో పాల్గొన్న కొందరు ఈ పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే బాలయ్య మాత్రం పార్టీ మద్యలో ఎంట్రీ ఇచ్చాడు. .

పార్టీ సందర్బంగా డీజే సౌండ్స్‌ మరియు మందు పార్టీతో సైమా వారు దుమ్మురేపారు. ఇక పార్టీలో పాల్గొన్న బాలకృష్ణ కాస్త మందు తాగి చిందేసినట్లుగా సమాచారం అందుతుంది. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. తెలుగు తారలతో పాటు ఇంకా ఇతర సౌత్‌ భాషల నటీనటులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు..

Siima Awards Midnight Dance By Balakrishna Nandamuri-

పార్టీ సందర్బంగా హీరోయిన్స్‌ శ్రియ, ప్రగ్యాజైస్వాల్‌, అంజలితో పాటు ఇంకా పలువురు హీరోయిన్స్‌తో బాలకృష్ణ స్టెప్పులు వేసినట్లుగా తెలుస్తోంది. అర్థరాత్రి సమయంలో స్టార్‌ హోటల్‌లో జరిగిన ఈ పార్టీలో ప్రతి ఒక్కరు ఫుల్‌ గా ఎంజాయ్‌ చేశారు. తన డాన్స్‌తో బాలయ్య అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు.