కామెడీగా చేసిన ట్వీట్‌.. కెరీర్‌ను నాశనం చేసే వరకు తీసుకు వచ్చింది   Santhosh Sivan Tweet Lands Him In Trouble With Producers     2018-09-20   08:43:54  IST  Ramesh P

ఈమద్య కాలంలో సోషల్‌ మీడియా చాలా పవర్‌ ఫుల్‌ అయ్యింది. ఏదో సరదాగా చేసిన పోస్ట్‌ కొన్ని జీవితాలను నాశనం చేసే వరకు తీసుకు వచ్చిన సందర్బాలు ఉన్నాయి. ఎన్నో పోస్ట్‌లు సంచలనంకు మారు పేరుగా నిలిచాయి. తాజాగా ఒక తమిళ సినిమాటోగ్రాఫర్‌ చేసిన ట్వీట్‌ ఆయన కెరీర్‌ను దెబ్బ తీసేలా తయారు అయ్యింది. ప్రస్తుతం ఆయనకు సినిమాల్లో అవకాశాలు రాకపోవచ్చు అంటూ అంతా భావిస్తున్నారు. పద్మశ్రీ అవార్డును దక్కించుకుని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును దక్కించుకుని అద్బుతమైన సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు ట్వీట్‌ వల్ల భారీ మూల్యం చెల్లించుకోబోతున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… తమిళ ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌. తమిళం, తెలుగుతో పాటు పలు భాషల సినిమాలకు సినిమాటోగ్రాఫీని అందించిన ఈయన మంచి టెక్నీషియన్‌గా పేరుంది. ఈయన చేసిన సినిమాలు అద్బుతాలుగా నిలిచాయి. అందుకే ఈయనకు తమిళనాడు ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు సిఫార్సు చేయడం జరిగింది. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. ఇంకా ఎన్నో రాష్ట్రీయ, జాతీయ అవార్డులను అందుకున్న ఈ సినిమాటోగ్రాఫర్‌ నిర్మాతల గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Santhosh Sivan Tweet Lands Him In Trouble With Producers-

రెండు కుక్క ఫొటోలను ఈయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం జరిగింది. అందులో మొదటి కుక్క కోపంగా ఉంది, ఆ ఫొటో కింది టెక్నీషియన్స్‌కు నిర్మాతలు పారితోషికం ఇచ్చే సమయంలో ఇలా ఉంటారు అంటూ కామెంట్‌ చేశాడు. ఇక రెండవ కుక్క కాస్త నవ్వుతూ ఉంది. ఆ ఫొటో కింద హీరోయిన్స్‌కు నిర్మాతలు పారితోషికాలు ఇచ్చే సమయంలో ఇలా ఉంటారు అంటూ కామెంట్‌ పెట్టాడు. నిర్మాతల విషయంలో ఈయన చేసిన వ్యాఖ్యలపై తమిళ నిర్మాతల మండలి సీరియస్‌ అయ్యింది.

ఈ విషయమై పలువురు నిర్మాతలు మండలికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వెంటనే భేటీ అయిన నిర్మాతల మండలి చర్యలకు సిద్దం అయ్యింది. మొదట వివరణ కోరి ఆ తర్వాత వివరణను బట్టి చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కొందరు నిర్మాతలు సంతోష్‌ శివన్‌పై తీవ్ర స్థాయిలో చర్యలు ఉండాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు.