తండ్రి,కొడుకులిద్దరిని బలితీసుకుంది ఆ నంబరే... హరికృష్ణ కార్ నంబర్ గురించి వెలుగులోకొచ్చిన ఆసక్తికరమైన విషయం.     2018-08-30   11:35:02  IST  Rajakumari K

గతంలో జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్న విషయం తెల్సిందే.తర్వాత హరికృష్ణ తనయుడు జానకి రామ్,ఇప్పుడు హరికృష్ణ ఒకే జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో నందమూరి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు ఎందుకిలా వెంటాడుతున్నాయోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.అయితే హరికృష్ణకి యాక్సిడెంట్ జరిగిన కార్ నెంబర్ పై ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది..అదేంటంటే..

Same Car No 2323 Kills Harikrishna And Janaki Ram-

Same Car No 2323 Kills Harikrishna And Janaki Ram

నందమూరి హరికృష్ణకు పెద్ద కుమారుడు జానకిరామ్ అంటే చాలా ఇష్టం… మిగిలిన ఇద్దరు కుమారులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ల కంటే కూడా జానకిరామ్ పైనే అమితమైన ప్రేమ చూపించేవారు.. అందుకే జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తర్వాత అతని కారు నంబరుతోనే తన కొత్త కారుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు హరికృష్ణ. 2014లో నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకి రామ్ కన్నుమూశారు.

Same Car No 2323 Kills Harikrishna And Janaki Ram-

ఆయన ప్రయాణించిన కారు నెంబర్ ఏపీ29 బీడీ 2323. కుమారుడు మరణించిన తర్వాత అతనిపై ఉన్న ప్రేమను చంపుకోలేక ఏపీ28 బీడబ్ల్యూ 2323 పేరుతో ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. కొడుకు ఇష్టపడి రిజిస్ట్రేషన్ చేయించుకున్న నంబర్ కావడంతో ఇదే సిరీస్‌లో హరికృష్ణ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు..ఇపుడు ఆ నంబరే హరికృష్ణ ప్రాణాలు తీసిందని నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.అంతేకాదు, తండ్రీకొడుకులిద్దరూ అదే నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరగడం వల్ల మరణించడంతో అభిమానులు తీవ్ర మనస్తాపానికి లోనవుతున్నరు..