సమంత నో చెబితే నిహారిక రెడీ.. 100 కోట్ల మూవీపై మెగా చూపు   Samantha Or Niharika In Megastars New Project     2018-09-23   08:38:26  IST  Ramesh P

ఇటీవల హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్త్రీ’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కేవలం 15 కోట్లతో నిర్మాణం అయిన ఈ చిత్రం ఏకంగా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. హర్రర్‌ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో శ్రధ్దా కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా, అసలు ఈ చిత్రం ఎప్పుడు తెరకెక్కిందో అనే విషయం కూడా తెలియకుండా పూర్తి చేసి విడుదల చేశారు. మెల్ల మెల్లగా ఈచిత్రం బాలీవుడ్‌ ప్రేక్షకులకు ఎక్కింది. కేవలం రెండు వారాల్లో ఏకంగా 100 కోట్లను ఈ చిత్రం రాబట్టింది. మొదట విడుదల చేసిన థియేటర్ల కంటే డబుల్‌ థియేటర్లు ఈ చిత్రంకు పెరిగాయి.

సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ‘స్త్రీ’ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు ఆసక్తి చూపుతున్న హీరోయిన్‌ సమంత వద్దకు ఈ ఆఫర్‌ వెళ్లినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఇటీవలే యూటర్న్‌ అనే హర్రర్‌ చిత్రం చేసిన సమయంత ప్రస్తుతం మరో హర్రర్‌ సినిమాకు ఆసక్తిగా లేదని సమాచారం అందుతుంది. అందుకే ఆ అవకాశం కోసం నిహారిక ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

Samantha Or Niharika In Megastars New Project-

తెలుగు మరియు తమిళంలో నిహారిక ‘స్త్రీ’ చిత్రం రీమేక్‌లో నటించాలని కోరుకుంటుంది. ఇప్పటికే స్త్రీ రీమేక్‌ రైట్స్‌ తీసుకున్న నిర్మాతలు నిహారికతో కూడా సంప్రదించినట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం రీమేక్‌లో ఎవరు నటిస్తారు అనే విషయంలో అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హిందీలో భారీ విజయం సాధించిన స్త్రీ చిత్రాన్ని నిర్మించినది తెలుగు నిర్మాతలే. అందుకే ఈ చిత్రంను తెలుగులో కూడా వారే నిర్మించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.