సమంతకు అభిమానుల, సినీ విశ్లేషకుల ఒక మంచి సలహా.. తీసుకుంటుందా

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత ఇటీవల ఒక మంచి నిర్ణయం తీసుకుంది.పెళ్లి చేసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేయాలనే ఆలోచన పక్కకు పెట్టి, మంచి సినిమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చింది.

 Samantha Getting Comments On Her Own Voice Dubbing-TeluguStop.com

యూటర్న్‌ వంటి విభిన్నమైన కథా చిత్రాలను ఎంపిక చేసుకోవడంతో పాటు, మంచి పాత్రలను చేయాలని, ఇకపై ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకోవాలని నిర్ణయించుకుంది.ఇప్పటి వరకు అందంతో అలరించిన సమంత ఇకపై తన నటనతో మెప్పించబోతున్నదన్నమాట.

ఇటీవల ఈమె నటించిన యూటర్న్‌ చిత్రంకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది.అయితే ఆ చిత్రంలో సమంత వాయిస్‌పై విమర్శలు వస్తున్నాయి.

‘యూటర్న్‌’ చిత్రం కోసం సమంత చాలా కష్టపడి సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకున్న విషయం తెల్సిందే.మహానటి చిత్రం కోసం కూడా సమంత డబ్బింగ్‌ చెప్పింది.ఆ సినిమా మంచి విజయాన్ని దక్కించుకోవడంతో పాటు, సమంత పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.ఆ కారణంగానే ఈ చిత్రంలో కూడా సమంత సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకునేందుకు ఆసక్తి చూపించింది.

సమంత ఆసక్తిని దర్శకుడు పవన్‌ కాదనలేక పోయాడు.ఆమె ఇష్టానుసారంగానే డబ్బింగ్‌కు ఓకే చెప్పాడు.

అయితే సమంత తమిళ యాసతో తెలుగులో డబ్బింగ్‌ చెప్పడంతో ట్రోల్స్‌ వస్తున్నాయి.

తెలుగులో సమంత మాట్లాడటం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది.ఇలాంటి సమయంలో ఒక కీలకమైన పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం అంటే మామూలు విషయం కాదు.గతంలో చిన్మయి వాయిస్‌తో సమంతను చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఆమె సొంత వాయిస్‌తో ఆమె సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు.

సమంత వాయిస్‌ ఎమోషనల్‌ సీన్స్‌లో అర్థం కావడం లేదని, ఆమె ఈ చిత్రానికి డబ్బింగ్‌ చెప్పుకోకుంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఇకపై చేయబోతున్న సినిమాల్లో కూడా సమంత డబ్బింగ్‌ చెప్పుకోకుంటే బెటర్‌ అంటూ ఆమె అభిమానులు సలహా ఇస్తున్నారు.

సమంతను చిన్మయి వాయిస్‌తో చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.ఆ కారణంగానే ఆమె ఇకపై చిన్మయి వాయిస్‌తో మాత్రమే వస్తే బాగుంటుందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube