సినిమా సగం పూర్తి... ఎందుకు ఇంత రహస్యం?     2018-08-16   08:41:29  IST  Ramesh Palla

మెగాస్టార్‌ ఫ్యామిలీ నుండి రెండు మూడు నెలలకు ఒక హీరో చొప్పున పరిచయం అవుతూనే ఉన్నారు అనిపిస్తుంది. ఇటీవలే చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా పరిచయం అయిన విషయం తెల్సిందే. విజేత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్‌ దేవ్‌ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాడు. కళ్యాణ్‌ దేవ్‌ విషయంలో జరిగిన తప్పును కొత్తగా రాబోతున్న మెగా హీరోల విషయంలో జరగకూడదు అనే ఉద్దేశ్యంతో మెగా కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ను హీరోగా పరిచయం చేసేందుకు కొత్త పద్దతి ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తుంది.

సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా ప్రస్తుతం సక్సెస్‌ కోసం కష్టాలు పడుతున్నాడు. ఇలాంటి సమయంలో తమ్ముడు వైష్ణవ్‌ హీరోగా పరిచయం అయితే ప్రేక్షకులు ఆధరిస్తారా అనే అనుమానాలు కొందరిలో వ్యక్తం అవుతున్నాయి. అయితే సాయి ధరమ్‌ తేజ్‌కు వైష్ణవ్‌కు సంబంధం ఏంటని, ఇద్దరి సినిమాలు వేరు వేరు, మంచి సినిమాలు చేస్తే తప్పకుండా హీరోలుగా సక్సెస్‌ అవుతారు అంటూ సినీ వర్గాల వారు భావిస్తున్నారు. అందుకే వైష్ణవ్‌ తేజ్‌ మూవీ ప్రారంభం అయ్యింది.

Sai Dharam Tej Brother Vaishnav Movie Shooting Updates-

Sai Dharam Tej Brother Vaishnav Tej Movie Shooting Updates

సహజంగా మెగా హీరోల మూవీస్‌ అంటే హంగు ఆర్భాటాలతో ఆరంభం అవుతాయి. కాని వైష్ణవ్‌ మొదటి సినిమా ఏమాత్రం సందడి లేకుండా, అసలు రహస్యంగా షూటింగ్‌ ప్రారంభం అవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. సినిమాకు సంబంధించిన చిత్రీకరణ చకచక జరుగుతున్నట్లుగా సమచారం అందుతుంది. భారీ ఎత్తున ఈ చిత్రం విషయంలో అంచనాలు ఉన్న కారణంగా కాస్త లో ప్రొఫైల్‌ మెయింటెన్‌ చేయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

పవన్‌కు ఆప్తుడు అయిన రామ్‌ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాత. అప్పట్లో ఒక్కడు ఉండేవాడు చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన రెండవ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా అనధికారిక సమాచారం అందుతుంది. సినిమా పూర్తి అయ్యే వరకు సినిమా గురించిన ఏ ఒక్క విషయం లీక్‌ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇంత రహస్యం ఎందుకు అనేది మాత్రం వారు చెప్పడం లేదు.