ఆర్ఎక్స్100 దర్శకుడి వివాహం..! హీరో కార్తికేయ చేసిన ట్వీట్ హైలైట్.!  

టాలీవుడ్ లో చిన్న సినిమాలకు ఇటీవల అందుతున్న క్రేజ్ మాములుగా లేదు. కంటెంట్ ఏ మాత్రం కొత్తగా ఉన్నా కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పెట్టేస్తున్నారు. ఈ ఏడాది వచ్చిన చిన్న సినిమాల్లో అతిపెద్ద విజయం అందుకున్న సినిమాగా ఆర్ఎక్స్ 100 నిలిచింది. సినిమాలో మసాలా ఎక్కువైందని సినీ విమర్శకులు కామెంట్స్ చేస్తున్నప్పటికీ యూత్ మాత్రం సినిమాను తెగ చూసేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు పెట్టిన బడ్జెట్ కి డబుల్ షేర్స్ అందాయి.

శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి వివాహ వేడుక వైభవంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురానికి చెందిన లక్ష్మీ శిరీషతో అజయ్ భూపతి వివాహం జరిగింది. ఈ శుభకార్యానికి ‘ఆర్ఎక్స్100’ నిర్మాత అశోక్ రెడ్డి, హీరో కార్తికేయ హాజరయ్యారు.

RX 100 Movie Hero Karthikeya Tweet About Ajay Bhupathi Marriage-

RX 100 Movie Hero Karthikeya Tweet About Ajay Bhupathi Marriage

కొంతకాలంగా అజయ్, శిరీష ప్రేమించుకుంటున్నారు. వీరిది పెద్దలు కుదుర్చిన ప్రేమ వివాహం అని తెలుస్తోంది. హైదరాబాద్ శామీర్‌పేటలోని రాగి కన్వెన్షన్ సెంటర్‌లో బంధుమిత్రుల మధ్య వీరి వివాహం వైభవంగా జరిగింది. అజయ్, శిరీష వివాహానికి హాజరైన ఫొటోను హీరో కార్తికేయ ట్వీట్ చేశారు. ‘నా బాస్‌‌కు ఆయన సొంత బాస్ వచ్చారు’ అని కార్తికేయ ట్వీట్‌లో పేర్కొన్నారు. అజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.