ఇది నిజంగా అద్బుతమైన రికార్డ్‌.. స్టార్‌ హీరోలు సైతం కుల్లుకుంటున్నారేమో!     2018-08-31   05:56:55  IST  Ramesh Palla

కార్తికేయ, పాయల్‌ జంటగా తెరకెక్కిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం మెల్ల మెల్లగా మౌత్‌ టాక్‌తో సక్సెస్‌, హిట్‌, సూపర్‌ హిట్‌, బ్లాక్‌ బస్టర్‌ అన్నట్లుగా సాగిపోయింది. కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా 15 కోట్ల షేర్‌ను దక్కించుకోవడంతో పాటు, ఇతర రైట్స్‌ ద్వారా నిర్మాతకు మరో అయిదు కోట్లను తెచ్చి పెట్టింది. అంటే మొత్తంగా 20 కోట్లను నిర్మాతకు తెచ్చి పెట్టిన ఈ చిత్రం తాజాగా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.

RX 100 Movie Completes 50 Days In 26 Centres-

RX 100 Movie Completes 50 Days In 26 Centres

గతంలో సినిమా సక్సెస్‌ను 50 డేస్‌ మరియు 100 డేస్‌ల థియేటర్ల సంఖ్యతో కొలిచే వారు. కాని ఇప్పుడు ఎంత పెద్ద స్టార్‌ హీరో సినిమా అయినా, ఎంతటి పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకున్నా కూడా రెండు లేదా మూడు వారాల కంటే ఎక్కువ ప్రదర్శింపబడటం లేదు. కారణం విడుదలను భారీ ఎత్తున ప్లాన్‌ చేసి, ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి, తద్వారా భారీగా లాభాలను దక్కించుకుంటున్నారు. దాంతో ఈమద్య కాలంలో అసలు 50 రోజులు, 100 రోజులు అనేదే మర్చిపోయారు. కాని ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రం మాత్రం స్టార్స్‌ సైతం అవాకయ్యేలా 50 రోజులను పూర్తి చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఏకంగా 26 థియేటర్లలో పూర్తి చేసుకోవడం చర్చనీయాంశం అవుతుంది. ఈమద్య కాలంలో ఇంత ఎక్కువ సంఖ్యలో 50 రోజులు పూర్తి చేసుకున్న చిత్రం ఇదే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. నైజాం ఏరియాలో 6, సీడెడ్‌లో 7, ఆంధ్రాలో 13 థియేటర్లలో ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ లెక్కన చూస్తే సినిమా 100 రోజు కూడా ఆడే అవకాశం కనిపిస్తుంది. భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం బయ్యర్లకు ఏకంగా మూడు నాలుగు రెట్ల లాభాలను తెచ్చి పెట్టినట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.