అయ్యో వర్మ నిరాశ పర్చాడు.. ఇంకాస్త మసాలా ఉండాల్సింది     2018-09-02   07:34:35  IST  Ramesh Palla

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ నిర్మాణంలో తాజాగా తెరకెక్కుతున్న ద్వి భాష చిత్రం ‘భైరవగీత’. సిద్దార్థ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్న సందర్బంగా తాజాగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం జరిగింది. ఫస్ట్‌లుక్‌లో ముద్దు సీన్‌తో వర్మ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఇక ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన వర్మపై మరింత అంచనాలు పెట్టుకున్నారు. ట్రైలర్‌లో వర్మ ముద్దులతో ముంచెత్తడం ఖాయం అంటూ అనుకున్నారు.

RGV Disappointed The Bhairava Geetha Audience-

RGV Disappointed The Bhairava Geetha Audience

తాజాగా విడుదలైన ట్రైలర్‌లో ప్రేక్షకులు ఎదురు చూసిన ముద్దు సీన్స్‌ ఎక్కువగా కనిపించలేదు. ముగింపులో ఒక ముద్దు సీన్‌ మినహా ట్రైలర్‌లో ఎక్కువగా మసాలా కనిపించలేదు. ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం తరహాలో చాలా ముద్దు సీన్స్‌ ఉంటాయని ఈ చిత్రంపై యూత్‌ ఆడియన్స్‌ ఆశలు పెట్టుకున్నారు. కాని వారి ఆశలు అడియాశలు అయ్యాయి. ఏమాత్రం అంచనాలు అందుకోకుండా, ఆసక్తిని కలిగించకుండా వర్మ భైరవగీత ట్రైలర్‌ రావడంతో ప్రేక్షకులు ఒకింత నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

ట్రైలర్‌ మొత్తం మితిమీరిన హింసను చూపించడం జరిగింది. హీరో మరియు హీరోయిన్‌ల మద్య కెమిస్ట్రీని పెద్దగా చూపించలేదు. దాంతో ప్రేక్షకులు ముందే సినిమాపై పెదవి విరుస్తున్నారు. ఇదో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ అనుకుంటే హింసాత్మక చిత్రం అని ట్రైలర్‌ ద్వారా తేలిపోయిందని, యూత్‌ ఆడియన్స్‌ అంటున్నారు. వర్మ ఈమద్య కాలంలో చేస్తున్న సినిమాలు అన్ని కూడా తీవ్రంగా నిరాశ పర్చుతూనే ఉన్నాయి.

RGV Disappointed The Bhairava Geetha Audience-

భారీ బడ్జెట్‌తో వర్మ నిర్మించిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చుతుందేమో అనే ఉద్దేశ్యం ముందే కలుగుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విడుదల ఏర్పాట్లు జరుగుతున్నాయి. కన్నడ మరియు తెలుగులో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు వర్మ ఏర్పాట్లు చేస్తున్నాడు. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్‌ పిక్చర్స్‌ విడుదల చేయబోతున్నారు.