అమెరికాలో హిందువులకి కోపం తెప్పించిన రిపబ్లికన్ పార్టీ..!

అమెరికాలో ఓ పత్రికా ప్రకటనలో హిందువుల మనోభావాలు కించపరిచేలా ఉండటంతో అక్కడ భారతీయులు ఆ ప్రకటన తీరుపై బగ్గుమంటున్నారు.హైందవ సంస్కృతిపై పరాచికాలు ఆడటం ఏమిటి అంటూ నిరసనలు తెలిపారు దాంతో ఆ ప్రకటనపై వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పింది రిపబ్లికన్ పార్టీ.

 Republican Party Apologises For Offensive Ad Featuring Lord Ganesha-TeluguStop.com

ఇంతకీ ఎందుకు వారు హిందువుల మనోభావాలు కించపరిచారు ఏమి జరిగింది అనే వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో గణేశుడి ఫొటోతో రిపబ్లికన్ పార్టీ పత్రికా ప్రకటన ఇచ్చింది అయితే ఈ మీరు గాడిదను పూజిస్తారా? లేదంటే ఏనుగునా? నిర్ణయం మీదే.అంటూ వినాయకుడి ఫొటోతో అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఇచ్చిన ప్రకటన పెద్ద దుమారమే రేపింది.టెక్సాస్‌లోని ఫోర్ట్ బెండ్ కౌంటీ రిపబ్లికన్ పార్టీ ఒక ప్రకటన జారీచేసింది.

వినాయకుడి తల పెద్దది.ఎందుకు అంటే భిన్నంగా ఆలోచించే శక్తి ఉంటుంది…కళ్ళు కూడా పెద్దవే మన చూపుకు ఆవల కూడా ఏముందో ఇట్టే తెలుసుకోవచ్చు.

చెవులు కూడా పెద్దవి.అంటే అందరు చెప్పేది సావధానంగా వింటాడు.

ఇక బొజ్జ పెద్దదే.జీవితంలో సంభవించే మంచి, చెడులు కూడా జీర్ణమైపోతాయి…లడ్డూ .మన శ్రమకు ప్రతిఫలం.

ఇలా వినాయకుడిని వర్ణిస్తూ ఎన్నికల ప్రచారంలో హిందువులని ఆకట్టుకోవాలని అనుకుంది అయితే ఈ ప్రకటన క్రింది భాగంలో మీరు వినాయకుడిని పూజిస్తారా గాడిదని పూజిస్తారా అంటూ ప్రకటన క్రింది భాగంలో తెలిపింది ఈ ప్రకటనపై హ్యూస్టన్‌లోని భారతీయులు.హిందూ సంఘాలు అభ్యంతరం తెలిపి, నిరసనను వ్యక్తంచేశారు.దీంతో ఫోర్ట్ బెన్ కౌంటీ రిపబ్లికన్ పార్టీ స్పందిస్తూ రిపబ్లికన్ పార్టీ గుర్తు ఏనుగు…డెమొక్రటిక్ పార్టీ సింబల్ గాడిద…రాజకీయ ప్రకటనలో భాగంగా ఆ రెండింటిని పోలుస్తూ ప్రకటన జారీచేశాం…అందుకు హిందువులు భాదపడితే క్షమించండి అంటూ మరొక ప్రకటన విడుదల చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube