రేణుదేశాయ్‌కి తెలుగు రైతుల గురించి ఏం తెలుసు  

పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ త్వరలో రెండవ పెళ్లికి సిద్దం అయ్యింది. ఇటీవలే నిశ్చితార్థం కూడా అయిన విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు తెలుగు రాష్ట్రాల్లో రేణుదేశాయ్‌ ఉండబోతున్నట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. రేణుదేశాయ్‌ తెలుగులో ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యింది. ఇటీవలే తెలుగులో ఒక చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నాను అంటూ ప్రకటించిన రేణుదేశాయ్‌ తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని వెళ్లడి చేసింది.

Renu Desai What Do You Know On Telugu Farmer-

Renu Desai What Do You Know On Telugu Farmer

రేణుదేశాయ్‌ సినిమా అంటే ఏదో ప్రేమ లేదా కామెడీ సినిమా అనుకున్నాం. కాని ఆమె రైతుల సమస్యలు మరియు రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో సినిమా తీస్తాను అంటూ ముందుకు వచ్చింది. రైతులు పడుతున్న ఇబ్బందులు తనకు తెలుసు అని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రైతులు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నారు. వారి గురించి సినిమా తీయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను, అది ఇన్నాళ్లకు నెరవేరబోతుంది అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం రైతుల సమస్యలను ఇంకాస్త డీప్‌గా తెలుసుకునేందుకు ఆమె ప్రయత్నిస్తుంది. త్వరలోనే క్షేత్ర స్థాయిలో రేణుదేశాయ్‌ పర్యటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. రేణుదేశాయ్‌ గత కొంత కాలంగా పూణెలో ఉంటుంది. సినిమా కోసం అక్టోబర్‌ లేదా నవంబర్‌లో రేణు దేశాయ్‌ హైదరాబాద్‌ రాబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్న రేణుదేశాయ్‌ నవంబర్‌లో లొకేషన్స్‌ మరియు డైలాగ్స్‌ను రాసుకోనుంది. సంక్రాంతి తర్వాత సినిమాను రెగ్యులర్‌ షూటింగ్‌ చేయబోతున్నట్లుగా రేణుదేశాయ్‌ చెప్పుకొచ్చింది.

Renu Desai What Do You Know On Telugu Farmer-

రేణుదేశాయ్‌కి రైతుల సమస్య గురించి ఏం తెలుసని ఆమె ఆ విషయమై సినిమా తీయానుకుంటుంది అంటూ కొందరు గుసగుసలాడుకుంటున్నారు. స్టార్‌ దర్శకులకు కూడా రైతుల సమస్యలపై సినిమా తీయాలంటే సాధ్యం అయ్యే పని కాదు. కాని రేణుదేశాయ్‌ చేస్తాననడం ఆశ్చర్యంగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రేణుదేశాయ్‌ తన నిర్ణయాన్ని మార్చుకుంటే బాగుంటుందని, ఒక మంచి ప్రేమ కథతో ఆమె సినిమాను చేసుకోవడం ఉత్తమం అంటున్నారు. రైతుల సమస్యతో సినిమా తీస్తే రేణుదేశాయ్‌కు ఇదే మొదటి మరియు చివరి చిత్రం అవుతుందనే టాక్‌ వినిపిస్తుంది.