శ్రీరెడ్డి బయోపిక్‌ రెడ్డి డైరీ.. అసలేం ఉండబోతుందంటే..  

సంచలనాలకు మారు పేరు అయిన శ్రీరెడ్డి తమిళనాట సంచలనం సృష్టించేందుకు సిద్దం అయ్యింది. తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో ఒక చిత్రంను చేసేందుకు సిద్దం అయ్యింది. తన బయోపిక్‌ను తమిళంలో తెరకెక్కించేందుకు ఈమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తన బయోపిక్‌లో తానే స్వయంగా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. నా మొదటి తమిళ సినిమా ప్రారంభం అయినందుకు సంతోషంగా ఉంది అంటూ ప్రకటించింది.

Reddy Diary Will Expose The Ugly Side Of Cinema: Sri Reddy-

Reddy Diary Will Expose The Ugly Side Of Cinema: Sri Reddy

తన బయోపిక్‌కు ‘రెడ్డి డైరీ’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్లుగా ఆమె ప్రకటించింది. తన బయోపిక్‌లో తనను మోసం చేసిన ప్రతి ఒక్కరి గురించి ఉంటుందని, కొందరి వీడియోలను కూడా సినిమాలో ఉంచబోతున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. తమిళనాట ఈమె చిత్రంపై పెద్దగా ఆసక్తి లేదు. కాని తెలుగు ప్రేక్షకుల్లో మాత్రం ఈమె సినిమా గురించి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. భారీ ఎత్తున ఈమె చేస్తున్న తమిళ సినిమా తెలుగులో విడుదల కాకున్నా కూడా తెలుగు హీరోలను టార్గెట్‌ చేయబోతుంది కనుక ఆసక్తిని రేకెత్తిస్తోంది.

శ్రీరెడ్డి ఇప్పటి వరకు పలువురు తెలుగు సినీ తారలపై విమర్శలు చేసిన విషయం తెల్సిందే. తాజాగా ఆ విషయాన్ని తన బయోపిక్‌లో చూపిస్తుందేమో అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. ఇప్పటికే పరువు పోయిన పలువురు ప్రముఖులు ఆ సినిమా వస్తే బయట కూడా తిరిగే పరిస్థితి ఉండదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరెడ్డి బయోపిక్‌కు తమిళ సినీ పరిశ్రమ సహకరించకుండా తెలుగు సినీ ప్రముఖులు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.

Reddy Diary Will Expose The Ugly Side Of Cinema: Sri Reddy-

శ్రీరెడ్డి తన బయోపిక్‌కు నడిగర్‌ సంఘం మద్దతుగా నిలుస్తుందని, తన సినిమాకు ఎలాంటి అడ్డంకులు రావని ఆశిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. చాలా కాలంగా తాను పడుతున్న బాధలను సినిమాలో చూపిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీరెడ్డి మాట్లాడుతూ దేశంలోని అన్ని భాషల సినిమా ఇండస్ట్రీల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి అంటూ ఆమె చెప్పుకొచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమ పరువు తీసేలా శ్రీరెడ్డి బయోపిక్‌ ఉండబోతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.