రాజమౌళి 'కార్తికేయ'కు సొంత తండ్రి కాదా.? మరి సొంత తండ్రి కొడుకులులాగా వారికి బాండ్ ఎలా కుదిరింది?   Reason Behind Rajamouli And Karthikeya Banding     2018-09-07   10:39:07  IST  Sainath G

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తనయుడు కార్తికేయ. ‘బాహుబలి’ సమయంలో కార్తికేయ పేరు బాగా వినిపించింది. దర్శకత్వంపై పెద్దగా ఆసక్తి లేని కార్తికేయ బాహుబలి సినిమాకు సంబంధించిన సెకండ్‌ యూనిట్‌ నిర్వహణ బాధ్యతలు అన్ని కూడా అతడే చూసుకున్నాడు. ప్రతి విషయంలో ఇన్వాల్వ్‌ అయ్యి మరీ కార్తికేయ ఈ చిత్రం కోసం పని చేశాడు అంటూ గతంలో పలు సందర్బాల్లో రాజమౌళి ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం సినిమా ప్రమోషన్‌ వీడియోల మేకింగ్‌ మరియు ప్రమోషన్స్‌ కార్యక్రమాల డిజైనింగ్‌లను కార్తికేయ చూసుకుంటున్నాడు.

ఈ సమయంలోనే ఈయన వివాహ నిశ్చితార్థం జరిగింది. హఠాత్తుగా వివాహ నిశ్చితార్థ వార్తలు రావడం ఆశ్చర్యంకు గురిచేస్తున్నాయి. గత కొంత కాలంగా కార్తికేయ ప్రేమలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యాడు.ఇంతకు కార్తికేయ చేసుకోబోతున్న అమ్మాయి ఎవంటే పూజా ప్రసాద్‌.ప్రముఖ నిర్మాత రాజేంద్ర ప్రసాద్‌ పెద్ద కొడుకు రాంప్రసాద్‌ కుమార్తె అయిన పూజా ప్రసాద్‌కు సింగర్‌గా మంచి గుర్తింపు ఉంది. చాలా కాలంగా భక్తి పాటలు పాడుతూ అరిస్తూ వస్తుంది. జగపతిబాబు అన్న కుమార్తె అయిన పూజా ప్రసాద్‌కు కార్తికేయకు జరిగిన వివాహ నిశ్చితార్థ కార్యక్రమంలో ఇరు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మాత్రమే పాల్గొన్నట్లుగా సమాచారం అందుతుంది.

Reason Behind Rajamouli And Karthikeya Banding-

రాజమౌళి – కీరవాణి అన్నదమ్ములు అని మనలో చాలా మందికి తెలుసు. కానీ “రమా రాజమౌళి” మరియు కీరవాణి గారి సతీమణి “శ్రీవల్లి” గారు సొంత అక్కచెల్లెలు అని చాలా తక్కువమందికి తెలుసు. ఇది ఇలా ఉండగా.. సోషల్ మీడియాలో రమా రాజమౌళి గారి ఒకప్పటి ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుంది. ఇంటర్వ్యూ లో “రమా రాజమౌళి” గారిని ఇంటర్వ్యూయర్ ఒక క్యస్షన్ అడిగింది..”రాజమౌళి గారు కార్తికేయకి స్టెప్-ఫాదర్ కదా..? మరి సొంత తండ్రి కొడుకులులాగా వారికి బాండ్ ఎలా కుదిరింది?”

రాజమౌళి గారు “రమా రాజమౌళి” కి రెండో భర్త అనే న్యూస్ అప్పటినుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది అబద్దం అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ 2012 లో ఓ ఇంటర్వ్యూ లో “రాజమౌళి” గారు స్వయంగా ఈ విషయం చెప్పారు. రమా గారితో నాకు చిన్నప్పటి నుండే పరిచయం ఉంది. కానీ చాలా సంవత్సరాల తరవాత ప్రేమగా మారింది. తనను పెళ్లి చేసుకునేటప్పటికి తనకి ఒక అబ్బాయి ఉన్నాడు. డివోర్స్ అయిన తరవాత నేను పెళ్లి చేసుకున్న అని చెప్పాడు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ వార్త సినీ అభిమానులలో చర్చనీయాంశం అయ్యింది!

watch video:https://youtu.be/6eDbAvW4wRM