మొహమాటం లేకుండా శిష్యుడి మూవీని కాపీ కొట్టేసిన వర్మ     2018-09-01   10:22:46  IST  Ramesh Palla

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా కూడా వివాదంగానే అనిపిస్తుంది. ‘ఆఫీసర్‌’ చిత్రం తర్వాత సైలెంట్‌ అయిన వర్మ కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు. చాలా అంచనాలు పెట్టుకుని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఆ చిత్రం వర్మకు చేదు అనుభవంను మిగిల్చింది. నాగార్జున కూడా ఆ చిత్రంపై పెట్టుకున్న నమ్మకం వమ్ము అయ్యింది. దాంతో చిన్న గ్యాప్‌ తీసుకున్న వర్మ తిరిగి వచ్చేశాడు. ఈసారి తన శిష్యుడు సిద్దార్థ దర్శకత్వంలో ‘భైరవగీత’ అనే చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

Ram Gopal Varma Copied His Student Movie-

Ram Gopal Varma Copied His Student Movie

‘భైరవగీత’ అనేది కన్నడ మరియు తెలుగులో తెరకెక్కిన చిత్రం. కన్నడ స్టార్స్‌ పలువురు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలోని కంటెంట్‌ పూర్తిగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రాన్ని పోలి ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లో ముద్దు సీన్‌ను చూస్తుంటే ఇది మరోసారి ఆర్‌ఎక్స్‌ 100 చిత్రాన్ని చూపించడం ఖాయంగా కనిపిస్తుంది అంటూ సినీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒక చిన్న చిత్రంగా తెరకెక్కిన ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం ఎంతటి విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఆ చిత్రంలో బోల్డ్‌ కంటెంట్‌ బొచ్చెడు ఉండటంతో పాటు, ముద్దు సీన్స్‌ హద్దు లేకుండా ఉన్నాయి. అందుకే ఆ చిత్రానికి యూత్‌ ఆడియన్స్‌ కనెక్ట్‌ అయ్యారు. దానికి తోడు విభిన్నమైన ప్రేమ కథను వర్మ శిష్యుడు అజయ్‌ భూపతి ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంలో చూపించి సక్సెస్‌ అయ్యాడు. కథ విషయంలో కాస్త అటు ఇటుగా ఉన్నా కథనం విషయంలో అజయ్‌ భూపతిని వర్మ తన తదుపరి చిత్రానికి ఫాలో అయినట్లుగా తెలుస్తోంది.

Ram Gopal Varma Copied His Student Movie-

వర్మ ఈ చిత్రంకు తన పేరు కాకుండా సిద్దార్థ పేరును దర్శకుడిగా వేస్తున్నాడు. వర్మ మొత్తం ముందుండి నడిపించినా కూడా దర్శకుడి పేరు స్థానంలో సిద్దార్థ అని వేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటో తెలియడం లేదు. ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంలో తరహాగా ‘భైరవగీత’ చిత్రంలో ముద్దు సీన్స్‌కు హద్దు ఉండదు అంటున్నారు. ఈమద్య కాలంలో ముద్దు సీన్స్‌ ఉన్న సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంటుంది. అందుకే ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని దక్కించుకుంటుందేమో చూడాలి.