చరణ్‌ ఏంటీ ఇలా చేశావ్‌.. బాబాయి బర్త్‌డే గిఫ్ట్‌పై ఫ్యాన్స్‌ పెదవి విరుపు     2018-09-03   09:10:29  IST  Sai Mallula

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌డే సందర్బంగా అభిమానులు పెద్ద ఎత్తున కోలాహలం సృష్టించారు. సోషల్‌ మీడియాలో పవర్‌ బర్త్‌డే సందర్బంగా అత్యధిక ట్వీట్స్‌ నమోదు అయ్యాయి. దాంతో రికార్డు సృష్టించినట్లుగా మెగా ఫ్యాన్స్‌ చెప్పుకుంటున్నారు. ఇక పవన్‌ బర్త్‌డే సందర్బంగా గిఫ్ట్‌ ఇవ్వబోతున్నట్లుగా చరణ్‌ ముందు రోజు ప్రకటించాడు. ఆ గిఫ్ట్‌ తన తాజా చిత్రం ఫస్ట్‌లుక్‌ అయ్యి ఉంటుందని అంతా భావించారు. కాని షాకింగ్‌గా బాబాయి కోసం ఒక డేరింగ్‌ పని చేసి అభిమానులను చరణ్‌ ఆశ్చర్యపర్చాడు.

బాబాయి బర్త్‌డే సందర్బంగా రామ్‌ చరణ్‌ పారా గ్లైడిగ్‌ను చేయడం జరిగింది. నిపుణుడి పర్యవేక్షణలో ఈ పని చేసిన రామ్‌ చరణ్‌ ఆకాళంలో ఉన్న సమయంలో హ్యాపీ బర్త్‌డే బాబాయి అంటూ అరుస్తూ బాబాయికి విషెష్‌ చెప్పాడు. కొందరు చరణ్‌ చేసిన పనికి థ్రిల్‌ అయినా కూడా కొందరు మాత్రం నిరాశ పర్చాడు అంటూ పెదవి విరుస్తున్నారు. రామ్‌ చరణ్‌ మూవీ నుండి ఫస్ట్‌లుక్‌ వంటిది వస్తే బాగుండేది అంటూ ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Ram Charan Special Birthday Wishes To Power Star Pawan Kalyan-

Ram Charan Special Birthday Wishes To Power Star Pawan Kalyan

పవర్‌ బర్త్‌డేకు మెగా ఫ్యామిలీలో ఏ ఒక్కరు తమ సినిమాలకు సంబంధించిన పోస్టర్‌, టీజర్‌లను విడుదల చేయకపోవడంతో విమర్శలు తీవ్ర స్థాయిలో వ్యక్తం అవుతున్నాయి. పవన్‌ బర్త్‌డేకు అభిమానులు ఇచ్చినంత ప్రాముఖ్య మెగా హీరోు ఇవ్వలేదు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో విషెష్‌తో సరి పెట్టిన మెగా హీరోలు తమ సినిమాల గురించి ఏదైనా వార్త తెలియజేసినా కూడా ఫ్యాన్స్‌ ఆనందించేవారు.

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న చిత్రం టైటిల్‌ను ప్రకటించడంతో పాటు, బర్త్‌డే సందర్బంగా ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేస్తారని అంతా ఆశించారు. కాని అనూహ్యంగా సినిమా విడుదలకు చాలా సమయం ఉన్న కారణంగా ఇప్పటి నుండే ఎలాంటి హంగామా సినిమాకు చేయవద్దని చిత్ర యూనిట్‌ సభ్యులు భావించి, బాబాయి బర్త్‌డేకు ఏదో ఒక ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశ్యంతో ఇలా పారా గ్లైడిగ్‌ను చరణ్‌ చేసినట్లుగా అభిమానులు చెబుతున్నారు.