ఆ పేరు వలన ఊర్లో యువతకి పెళ్లిల్లు కావట్లేదంట.కాబట్టి ఏం చేశారంటే     2018-08-11   14:26:52  IST  Rajakumari K

ఆ వూరులో యువతకు చదువు లేదా అంటే బాగా చదువుకున్నారు..పోని ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరుమీద పడి తిరుగుతున్నారా అంటే అదీ లేదు..అందరూ మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు.పోనీ గ్రామంలో కనీస సౌకర్యాలు లేవా అంటే అన్ని సౌకర్యాలు బాగున్నాయి..కాని ఆ ఊరి అబ్బాయిలకు పిల్లనివ్వడానికి భయపడుతున్నారు. వారిని అంతగా భయపెడుతున్న అంశం ఏంటేం ఆ ఊరిపేరు..

Rajasthan Village Miyan Ka Bara Renamed As Mahesh Nagar-

Rajasthan Village Miyan Ka Bara Renamed As Mahesh Nagar

ఆ గ్రామం పేరు మియాన్ కా బారా హల్ట్. ఆ గ్రామానికి ముస్లిం పేరు ఉండటం వల్ల చాలా సంబంధాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతున్నాయట. దీంతో ఆ గ్రామస్థులు ప్రభుత్వానికి తమ గోడు చెప్పుకున్నారు. వారి వాదనతో ఏకీభవించిన ప్రభుత్వం వారి గ్రామానికి మహేశ్‌పూర్ అని నామకరణం చేసింది. రాజస్థాన్‌లోని బర్మీర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. ఇన్ని సంవత్సరాల తర్వాతైనా అధికారులకు కనికరం కలిగినందుకు ఆనందంగా ఉన్నారు గ్రామస్థులు.

Rajasthan Village Miyan Ka Bara Renamed As Mahesh Nagar-

దేశానికి స్వాతంత్య్రం రాకమునుపే మహేశ్‌నగర్ అనే పేరు ఉండేదని… ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పేరును మార్చారట. గ్రామస్థుల కోరిక మేరకే గ్రామం పేరు మార్చడం జరిగిందని… దీనిలో ఎటువంటీ రాజకీయం లేదని స్థానిక ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కాగా ఈ గ్రామంలో హిందువులు మెజారిటీ సంఖ్యలో ఉండగా, ముస్లింలు మైనారిటీ సంఖ్యలో ఉన్నారు. ఇక నుండి పెళ్ళిల్లు చేసుకోవడానికి ఇక్కడి యువత ఇబ్బంది పడాల్సిన పని లేదని గ్రామపెద్ద తెలిపారు.