రాజమౌళి కొడుకు ప్రేమ వివాహం.. అమ్మాయి ఎవరో తెలిస్తే అవునా అంటారు!   Rajamouli Son Karthikeya Gets Engaged To Jagapathi Babu Niece     2018-09-06   08:13:18  IST  Ramesh P

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తనయుడు కార్తికేయ. ‘బాహుబలి’ సమయంలో కార్తికేయ పేరు బాగా వినిపించింది. దర్శకత్వంపై పెద్దగా ఆసక్తి లేని కార్తికేయ బాహుబలి సినిమాకు సంబంధించిన సెకండ్‌ యూనిట్‌ నిర్వహణ బాధ్యతలు అన్ని కూడా అతడే చూసుకున్నాడు. ప్రతి విషయంలో ఇన్వాల్వ్‌ అయ్యి మరీ కార్తికేయ ఈ చిత్రం కోసం పని చేశాడు అంటూ గతంలో పలు సందర్బాల్లో రాజమౌళి ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం సినిమా ప్రమోషన్‌ వీడియోల మేకింగ్‌ మరియు ప్రమోషన్స్‌ కార్యక్రమాల డిజైనింగ్‌లను కార్తికేయ చూసుకుంటున్నాడు.

ఈ సమయంలోనే ఈయన వివాహ నిశ్చితార్థం జరిగింది. హఠాత్తుగా వివాహ నిశ్చితార్థ వార్తలు రావడం ఆశ్చర్యంకు గురిచేస్తున్నాయి. గత కొంత కాలంగా కార్తికేయ ప్రేమలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యాడు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నా కూడా కార్తికేయ ఆ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఎట్టకేలకు వివాహ నిశ్చితార్థం తర్వాత ప్రేమ విషయం బయటకు వచ్చింది. ఇంతకు కార్తికేయ చేసుకోబోతున్న అమ్మాయి ఎవంటే పూజా ప్రసాద్‌.

Rajamouli Son Karthikeya Gets Engaged To Jagapathi Babu Niece-

ప్రముఖ నిర్మాత రాజేంద్ర ప్రసాద్‌ పెద్ద కొడుకు రాంప్రసాద్‌ కుమార్తె అయిన పూజా ప్రసాద్‌కు సింగర్‌గా మంచి గుర్తింపు ఉంది. చాలా కాలంగా భక్తి పాటలు పాడుతూ అరిస్తూ వస్తుంది. కేవలం భక్తి పాటలపైనే ఆసక్తితో ఆమె సింగర్‌గా కొనసాగుతుంది. సినిమాల్లో పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయిన పూజా ప్రసాద్‌కు కార్తికేయకు ఎక్కడ పరిచయం అయ్యి ఉంటుందా అంటూ ప్రస్తుతం అంతా కూడా చెవులు కొరుక్కుంటున్నారు.

జగపతిబాబు అన్న కుమార్తె అయిన పూజా ప్రసాద్‌కు కార్తికేయకు జరిగిన వివాహ నిశ్చితార్థ కార్యక్రమంలో ఇరు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మాత్రమే పాల్గొన్నట్లుగా సమాచారం అందుతుంది. వీరి వివాహం ఈ సంవత్సరం డిసెంబర్‌లోనే జరిపేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తికేయ, పూజా కుమార్‌ల వివాహం అంగరంగ వైభవంగా తెలుగు సినిమా తారలు తరలి వచ్చే అవకాశం ఉంది.