కేరళకు లారెన్స్ భారీ విరాళం..ఎంతో తెలుస్తే షాక్.! చివరగా ప్రభుత్వాన్ని ఏమని కోరారంటే.?     2018-08-23   16:39:44  IST  Sai Mallula

కేరళను వర్షం కుదిపేసింది. గత వారం రోజులుగా వరద ముంచెత్తుతోంది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఇప్పటివరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. వేల సంఖ్యలో వరద బాధితులను కాపాడుతున్నాయి సహాయక టీమ్ లు.

కేర‌ళ‌లో ప్ర‌కృతి విప‌త్తు, వ‌ర‌ద‌ల స‌మ‌యంలో జాతీయ స్థాయిలో ప్ర‌జ‌లు కుల మత బేధాలు లేకుండా స్పందిస్తున్నారు. త‌మ స్థాయికి త‌గ్గ‌ట్టు విరాళాలు ఇస్తున్నారు. కొంద‌రు ఐదు రూపాయ‌లు ఇస్తున్నారు కొందరు ల‌క్ష రూపాయ‌లు . హీరోలు, సామాన్యులు, మంత్రులు, ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఉద్యోగం లేని వాళ్లు. ఇలా ఎవ‌రికి తోచిన విధంగా వారు స‌హాయం చేస్తున్నారు.

సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే ఆయన సినీ ప్రముఖులందరి కంటే ది బెస్ట్ అనిపించుకున్నారు. సినీ ప్రముఖులలో ఇప్పటి వరకూ ఎవరూ ప్రకటించనంత భారీ విరాళాన్ని ప్రకటించడమే కాకుండా మనం ఆశ్చర్యపోయే విధంగా కేరళ సీఎంను ఓ కోరిక కోరనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విటర్ ద్వారా ప్రకటించారు లారెన్స్.

Raghava Lawrence To Donate Rs 1 Crore Towards Relief Fund-

Raghava Lawrence To Donate Rs 1 Crore Towards Relief Fund

‘‘హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్! నేను కేరళకు కోటి రూపాయల విరాళాన్ని అందించాలని నిర్ణయించుకున్నాను. వరదల కారణంగా కేరళ పూర్తిగా నాశనమై మనకు సోదర సోదరీమణుల వంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవడం నన్ను కలచివేసింది. ఇదంతా చూస్తున్నప్పుడు స్వయంగా నేను వెళ్లి సర్వీస్ చేయాలనుకున్నాను కానీ అన్ని ప్రదేశాలకూ వెళ్లడం చాలా కష్టమని అక్కడి అధికారులు తెలిపారు.భారీ వర్షాలు కరుస్తున్న కారణంగా అవి తగ్గుముఖం పట్టే వరకు నన్ను ఆగమన్నారు. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను.

నేను గవర్నమెంట్ సాయంతో ముందుకెళ్లాలనుకుంటున్నాను ఎందుకంటే వరదల కారణంగా ఏ ప్రాంతం బాగా ధ్వంసమైందో గవర్నమెంట్‌కు తెలుసు. ఇప్పటికే నేను ఈ శనివారం కేరళ సీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్ పొందాను. ఆ రోజు నా డొనేషన్‌ను అందజేసి ఏ ప్రాంతమైతే బాగా దెబ్బతిన్నదో ఆ ప్రాంత ప్రజలకు డైరెక్ట్‌గా సర్వీస్ చేసేందుకు అవకాశం కల్పించమని కోరనున్నాను. ఇప్పటి వరకూ కేరళకు విరాళాన్ని ప్రకటించిన వారికీ.. ప్రకటించబోతున్నవారికీ థాంక్స్. కేరళ త్వరగా పునర్నిర్మితం కావాలని రాఘవేంద్రస్వామిని ప్రార్థిస్తున్నాను’’ అని లారెన్స్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ప్రముఖులంతా ఎంతో కొంత సాయం చేసి చేతులు దులుపుకున్నారే ఇలా డైరెక్ట్‌గా వెళ్లి కేరళ ప్రజలకు సాయం చేయాలని ఎవరూ భావించలేదు. లారెన్స్ స్వయంగా వెళ్లి ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించడంతో నెటిజన్లు షాక్ అవడమే కాదు.. ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.