రియల్ హీరోగా మారిన రీల్ హీరో…ఫ్యాన్ కి ఇల్లు కట్టించాడు.... ఆ హీరో ఎవరో తెలుసా...     2018-08-21   11:56:04  IST  Sai Mallula

ప్రేక్షకదేవుళ్లు అని అందరు హీరోలు సంభోదిస్తుంటారు..కాని కొందరు మాత్రమే ప్రేక్షకులను దేవుళ్లకంటే ఎక్కువగా చూసుకుంటారు.వారిలో తమిళ హీరోలు ముందుంటారు..లారెన్స్,సూర్య,విక్రమ్,కార్తీ,రజినికాంత్ ఇలా అందరూ ఫ్యాన్స్ విషయంలో ఎప్పటికప్పుడు తమ ఉదార స్వభావాన్ని చాటిచెప్తారు.కేవలం తమ ఫ్యాన్స్ విషయంలోనే కాదు సేవలోనూ,సామాజికాంశాలలో పాల్గొనడంలో కూడా ముందుంటారు..ఇప్పటివరకు వందల సంఖ్యలో గుండె ఆపరేషన్లు చేయించిన లారెన్స్ రాఘవ తాజాగా తన అభిమాని కోసం ఏకంగా ఇల్లే కట్టించి ఇచ్చాడు..వివరాల్లోకి వెళితే..

Raghava Lawrence Builds A House For His Fan's Parents-

Raghava Lawrence Builds A House For His Fan's Parents

పోయిన ఏడాది తల్లికి గుడి కట్టించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు లారెన్స్. ఇప్పుడు మరో అరుదైన సాయం చేసి.. రీల్ కాదు రియల్ హీరో అని నిరూపించుకున్నారు. తన పిలుపునకు స్పందించిన ఉద్యమంలో పాల్గొని.. చనిపోయిన అభిమాని కుటుంబానికి ఇల్లు కట్టించాడు.గత ఏడాది తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం జరిగింది గుర్తుంది కదా. ఇందులో రాఘవ లారెన్స్ మద్దతు ఇవ్వటంతోపాటు.. స్వయంగా పాల్గొన్నాడు. లక్షల మంది యువకులు రోడ్లపైకి వచ్చారు. ఈ జల్లికట్టు ఆందోళనలో యోగేశ్వర్ అనే యువకుడు చనిపోయాడు. అతను లారెన్స్ వీరాభిమాని. విషయం తెలిసిన వెంటనే.. ఆ కుటుంబాన్ని పరామర్శించారు లారెన్స్. అదే సమయంలో యోగేశ్వర్ కోరిక ఏంటీ అని ఆ తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు లారెన్స్. సార్.. మా అబ్బాయికి సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంది.. అందులో మమ్మల్ని జీవితాంతం చూసుకోవాలనే తపన పడేవాడు అని చెప్పారు ఆ కుటుంబ సభ్యులు. నా అభిమాని కోరిక తీర్చటం నా ధర్మం అని చెప్పి అక్కడినుండి వెళ్లిపోయారు.

Raghava Lawrence Builds A House For His Fan's Parents-

కేవలం మాట చెప్పి ఊరుకోలేదు చేతల్లో చూపించారు ..అది కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే యోగేశ్వర్ కుటుంబానికి ఇల్లు కట్టించాడు. ఇటీవలే అది పూర్తయ్యింది. ఆ ఇంట్లోకి యోగేశ్వర్ కుటుంబం గృహ ప్రవేశం చేసింది. ఈ విషయాలను స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు రాఘవ లారెన్స్. ఇంటి నిర్మాణానికి రూ.15 లక్షల వరకు ఖర్చు అయ్యిందని అభిమానులు చెబుతున్నారు. ఒక్క పైసా కూడా యోగేశ్వర్ కుటుంబం ఖర్చు పెట్టుకుండా.. మొత్తం లారెన్స్ ఖర్చు చేశారు. హ్యట్సాప్ లారెన్స్ అనకుండా ఉండలేం కద.