హౌస్ మేట్స్ పై హాట్ కామెంట్స్ చేసిన పూజ.! శ్యామల నాకు నచ్చదు..కౌశల్ తో గొడవ పడితే ఎలిమినేట్ చేస్తారా.?  

ఇంకొంచెం మసాలా అనే టాగ్ లైన్ తో నాని హోస్ట్ చేస్తున్న “బిగ్ బాస్” రెండో సీజన్ చివరి దశకు చేరింది. హౌస్‌ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ హాట్ బ్యూటీ పూజా రామచంద్రన్ ఇటీవలే ఎలిమినేట్ అయ్యింది. ఒకే ఇంట్లో ఉన్న సభ్యులు ఇపుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. టైటిల్ వేట దగ్గర పడుతుండడంతో ఎవరూ తగ్గడం లేదు. కౌశల్ ఒంటరి పోరాటం చేస్తున్నాడనే అభిప్రాయం బయట మద్దత్తు దారులలో ఉండగా.. మిగిలిన ఇంటి సభ్యులు మాత్రం కౌశల్ సింపతీ కోసం ప్రయత్నిస్తున్నాడని నిందిస్తున్నారు. కొన్ని రోజులుగా హౌస్ లో ఈ పరిస్థితి కొనసాగుతోంది.

Pooja Ram Xharan Comments On Bigg Boss Housemates-

Pooja Ram Xharan Comments On Bigg Boss Housemates

ఇది ఇలా ఉండగా…హౌస్ నుండి బయటకి వచ్చిన పూజ ఒక ఇంటర్వ్యూలో హౌస్ లోని తన అనుభవాలను పంచుకుంది. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నపుడు బెస్ట్ మూమెంట్స్ అంటే కమల్ హాసన్ సర్ రావడమే. ఆయన మా దగ్గర కూర్చుని మాట్లాడటం మాలో మరింత ఉత్సాహం నింపింది. హీరోయిన్ తాప్సీ నాకు మంచి ఫ్రెండ్. ఆమె వచ్చినపుడు నాతో పాటు ఇంట్లోనే ఉండిపోతే బావుండు అనిపించింది.

Pooja Ram Xharan Comments On Bigg Boss Housemates-

దీప్తి సునైన వెల్లిన తర్వాత కూడా మామూలుగానే అనిపించింది. దీప్తి నల్లమోతు నేను ఇంట్లో ఎంటరవ్వగానే బాగా కనెక్ట్ అయింది. అయితే ఆమె చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. చాలా రిజర్వగా ఉంటుంది. ఇంట్లో చాలా ఇష్టమైన వ్యక్తులు దీప్తి, సామ్రాట్. నచ్చని వ్యక్తి శ్యామల.

బిగ్ బాస్ హౌస్ లోకి నేను వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే మూడు రోజుల ముందే కౌశల్ ఆర్మీ గురించి విన్నాను. కానీ ఇంత పెద్ద ఆర్మీ, అభిమానులు ఉన్నారని బయటకు వచ్చిన తర్వాతే తెలిసిందన్నారు.

ఇంట్లో కౌశల్‌తో గొడవ పడితే ఎలిమినేట్ అవుతారనే ప్రచారం నిజం కాదు అని నా అభిప్రాయం. ఇంట్లో తనీష్ ప్రతి వారం గొడవ పడుతూనే ఉన్నాడు. ఇక్కడ కేవలం ప్రేక్షకుల ఓట్లను బట్టే ఎలిమినేషన్స్ జరుగుతాయి అని పూజా తెలిపారు.