వరుస కాల్పులతో ఆందోళనలో భారతీయ కుటుంభాలు..   Police Fire On Indians At Maryland     2018-09-21   15:00:17  IST  Bhanu C

అమెరికాలో గన్ కల్చల్ రోజు రోజు కి హెచ్చు మీరుతోంది..కొన్ని రోజుల కాల వ్యవధిలోనే వరుసగా కాల్పులు జరగడం అమెరికాలో ఎంతో మందిని ఆందోళనకి గురిచేస్తోంది..అక్కడి ప్రభుత్వాలు గన్ కల్చర్ ని పెంచి పోషించడంతో చివరికి చిన్నపిల్లలు సైతం స్కూల్ బ్యాగ్ లలో తుపాకులు పెట్టుకుని తిరుగుతున్నారు..స్కూల్ లో టీచర్ పై కోపం వచ్చినా సరే గన్ తీసి కాల్చి పడేస్తున్నారు..ఈ క్రమంలోనే

సెప్టెంబర్ కాలంలోనే వరుసగా ఈ ఘటనతో కలిపి మూడు సార్లు కాల్పులు వివిధ ప్రాంతాలలో జరిగాయి..తాజాగా

అమెరికాలోని మేరీలాండ్‌ రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు..గురువారం ఉదయం 9 గంటలకు హార్ఫర్డ్ కౌంటీలోని పెరీమాన్ ప్రాంతంలో ఉన్న ఓ ఫార్మసీ కేంద్రం దగ్గర ఈ కాల్పులు జరిగాయి…కొంతమంది మృతి చెందగా మరికొందరు గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.

Police Fire On Indians At Maryland-

అయితే అక్కడి పోలీసులు ఆ ప్రాంతంలో వారికి హెచ్చరికలు జారీ చేశారు..స్థానికులు ఆ ప్రాంతంలో సంచరించొద్దని అధికారులు హెచ్చరించారు. కాల్పులు జరిగినట్లు సమాచారం అందిన కొన్ని నిమిషాల్లోనే ఎఫ్‌బీఐ అధికారులు అక్కడికి చేరుకున్నారు..అయితే ఈ ఒక్క నెలలోనే వరుసగా మూడు సార్లు అమెరికాలో కాల్పులు జరగడంతో అక్కడ ఉన్న భారతీయ ఎన్నారైలతో పాటుగా వారి వారి స్వస్తలాలలో ఉన్న కుటుంభ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు..