కంటతడి పెట్టించిన ఫోటో వెనక షాకింగ్ నిజం...2007 నాటి ఫోటో ఇప్పుడెందుకు వైరల్... ముస‌లావిడ‌ కావాల‌నే వృద్ధాశ్ర‌మంలో...     2018-08-25   10:45:14  IST  Sai Mallula

స్కూల్ ట్రిప్లో భాగంగా వెళ్లిన విధ్యార్ధిని అక్కడ తన గ్రాండ్‌మాను చూసి కన్నీరుమున్నీరు అయింది. ఇది చూస్తుంటే ఎవరి కళ్లైనా చెమర్చుతాయి.రెండేళ్ల తర్వాత తన నాన్నమ్మను చూసింది ఆ అమ్మాయి.అంతకాలం పాటు తన పేరెంట్స్ నాన్నమ్మ ఎక్కడ అని అడిగితే రిలేటివ్స్ ఇంటికి వెళ్లిందని చెప్తుండేవారని చెప్పుకొచ్చింది. ఈ స్టోరీ గత కొన్ని రోజులుగా ఫేస్బుక్ లో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూస్తే కన్నీళ్లొస్తాయి అనే టైటిల్ తో వైరల్ అవుతుంది. కానీ ఆ ఫోటో వెనక అసలు కథ వేరే ఉంది. ఆ ఫోటో 2007 లో ది. మరి ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుంది.? పైగా ఆమె కావాలనే వృద్ధాశ్రమంలో ఉంటున్నారు అంట.! అసలు కథ ఏంటో మీరే చూడండి!

Photo Of Girl And Grandma Real  Except The Old Woman Wasn’t Forsaken-

Photo Of Girl And Grandma Real, Except The Old Woman Wasn’t Forsaken

2007 సెప్టెంబర్‌ 12న ఫోటోజర్నలిస్ట్‌ కల్పెష్ ఎస్‌ భరేచ్‌కు గుజరాత్‌ మనినగర్‌లోని జీఎన్‌సీ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఘోదసర్‌లోని మనిలాల్‌ గాంధీ వృద్ధాశ్రమానికి స్కూల్‌ పిల్లలను తీసుకెళ్తున్నామని, ఈ స్కూల్‌ ట్రిప్‌ను కవర్‌ చేయమని ప్రిన్సిపాల్‌ కోరారు. భరేచ్‌, పిల్లలతో పాటు వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు. కానీ ఆ అసైన్‌మెంటే తన జీవితాన్ని ఓ మలుపు తిప్పుతుందని భరేచ్‌ కలలో కూడా ఊహించి ఉండడు. ఫీల్డ్‌ ట్రిప్‌లో భాగంగా పిల్లలను, పెద్ద వాళ్ల పక్కన కూర్చోమని.. మంచి మంచి ఫోటోలు తీస్తున్నాడు. స్కూల్‌ పిల్లల్లో ఒక చిన్న అమ్మాయి.. ఒక గదిలోకి వెళ్లగానే ఓ ముసలావిడ దగ్గరికి ఏడ్చుకుంటూ పరిగెత్తింది. ఆ మహిళ కూడా చిన్నారిని గట్టిగా పట్టుకుని ఏడ్చింది. ఏం జరిగిందా? అని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కానీ ఆ ముసలావిడ చెప్పిన స్టోరీ వినగానే మేమందరం ఒక్కసారిగా మూగబోయాం అని భరేచ్‌ చెప్పాడు.

ఆ ముసలావిడ, ఆ అమ్మాయికి నాన్నమ్మ అట. ఎంతో కాలం తర్వాత మనవరాలిని చూసిన ఆ ముసలావిడ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు గట్టిగా పట్టుకుని తనివితీరా ఏడ్చారు. నాన్నమ్మ బయటికి వెళ్లిందని ఎప్పుడూ నాన్న చెబుతుండే వాడని ఆ పాప చెప్పింది. కానీ ఎప్పుడూ కూడా వృద్ధాశ్రమంలో ఉందని చెప్పలేదని కన్నీంటి పర్యంతమైంది. నానమ్మ, మనవరాళ్లు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్న ఫోటోతో పాటు, వీరి స్టోరీని గుజరాతి డైలీ దివ్య భాస్కర్‌లో ఫ్రంట్‌ పేజీలో పబ్లిష్‌ చేశారు.

Photo Of Girl And Grandma Real  Except The Old Woman Wasn’t Forsaken-

ఇక్క‌డి దాకా వంద శాతం నిజం. కానీ కొడుకు క‌ర్క‌శంగా పంపిన విష‌యం గురించి మ‌నం ఇప్పుడు మాట్లాడుకోవాలి. నిజానికి ఆ చిత్రం 2007లో తీసింది. దాదాపు 11 సంవ‌త్స‌రాల క్రితం తీసిన ఈ చిత్రం ప్ర‌పంచ ఫొటోగ్రాఫీ రోజు మ‌ళ్లీ ఎవ‌రో అప్‌లోడ్ చేశాడు. అంతే వైర‌ల్ అయిపోయింది. నిజానికి అందులో ఉన్న ద‌మ‌యంతి బెన్ ను కొడుకు వృద్ధాశ్రమానికి పంపించ‌లేద‌ట‌. ఆమెనే త‌న ఇష్టంగా అందులో చేరింది అంట‌. ఆమెకు ఆమెనే ఎందుకు చేరుతుంది అంటారా?? బహుశా త‌న వ‌య‌సు వాళ్ల‌తో ఉంటే కాల‌క్షేపం బాగా అవుతుంది అని వెళ్లిందేమో.

ఈ మ‌ధ్య మ‌ళ్లీ ఆ ఫోటో వైరల్ అవ‌డంతో భ‌క్తి, ద‌మ‌యంతి బెన్ ఇద్ద‌రూ క్లారిటీ ఇవ్వ‌డానికి బీబీసికి ఒక ఇంటర్య్వూ ఇచ్చారు. అందులో తెలిసిన విష‌యాలివి. వైర‌ల్ చిత్రంలో స్కూల్ గాళ్‌గా క‌నిపించిన భ‌క్తికి ఇప్పుడు పెళ్లై పోయింది. పిల్ల‌లు కూడా ఉన్నారు. త‌న‌కు నాయిన‌మ్మ అంటే ఇష్ట‌మ‌ని .. అందుకే త‌న‌తో కానీ.. తండ్రితో కానీ ఉండిపోమ‌ని చాలా సార్లు చెప్పింద‌ట‌. కానీ ఆమె ఇప్ప‌టీకీ వృధ్దాశ్ర‌మంలో ఉంటుంద‌ని. అది త‌న ఇష్ట‌మ‌ని చెబుతోంది. ఆమె త‌మ‌తో ఉంటే అంత‌కు మించిన ఆనందం మ‌రోటి లేద‌ని చెబుతోంది భ‌క్తి.