ఆర్.ఎక్స్.100 హీరోయిన్ సంచలన కామెంట్స్...సినిమాలో అన్ని ముద్దులు పెట్టాన‌ని బ‌య‌ట కూడా.     2018-08-21   13:31:04  IST  Sai Mallula

RX100 మూవీలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోయటమే కాదు మతి పోయేలా లిప్ లాకులు చేసింది పాయల్ రాజపుత్. తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన ఈ ఉత్తరాది భామ టాలీవుడ్ లో ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అసలు ఈ సినిమా ట్రైలర్ తోనే ఆడియన్స్ పిచ్చెక్కి పోయారంటే అతిశయోక్తి కాదు.అర్జున్ రెడ్డి లో ఒకటి రెండు లిప్ లాకులకే అబ్బా అనుకున్నారు. RX100 మూవీలో మోతాదుకు మించిన సీనులతో పాయల్ రాజపుత్ రగిల్చిన వేడి అంతా ఇంతా కాదు. రివ్యూలలో సైతం పాయల్ కే మార్కులు వేస్తున్నారు సినీ క్రిటిక్స్. దాన్ని బట్టే అమ్మడు ఏ స్థాయిలో బోల్డ్ గా యాక్ట్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు.

Payal Rajput Sensational Comments On Tollywood Industry-

Payal Rajput Sensational Comments On Tollywood Industry

ఇది ఇలా ఉండగా..హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్‌కు నాలుగు రోజుల కింద‌ట కాస్టింగ్ కౌచ్ అనుభ‌వం ఎదురైంద‌ట‌. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది.

“నాకు క‌థ న‌చ్చితే సినిమా కోసం ఏమైనా చేస్తాను. కానీ, బ‌య‌ట మాత్రం కాదు. సినిమాలో అన్ని ముద్దులు పెట్టాన‌ని బ‌య‌ట కూడా ముద్దులు పెడ‌తాన‌ని అనుకుంటున్నారా? నా తొలి సినిమా చూసి నా గురించి ఏదేదో ఊహించుకుంటున్న‌ట్టున్నారు. విజ‌య‌వంత‌మైన సినిమాలో న‌టించిన త‌ర్వాత కూడా నాకు కాస్టింగ్ కౌచ్ అనుభ‌వం ఎదురైంది. నాల్రోజుల క్రితం ఒక‌రు ఫోన్ చేసి `కాంప్ర‌మైజ్‌` అయితే అవ‌కాశం ఇస్తాన‌ని చెప్పాడు. నేను టాలెంట్‌తోనే ఇంత దూరం వ‌చ్చాను త‌ప్ప‌.. కాంప్ర‌మైజ్ అయి కాదు” అని పాయ‌ల్ చెప్పింది.

Payal Rajput Sensational Comments On Tollywood Industry-