ఎవరికీ తెలియని పవన్ ఫస్ట్ లవ్ స్టోరీ.! క్లాస్ లో కలిసిన అమ్మాయికి ప్రొపోజ్ చేస్తే క్లాస్ పీకింది.!     2018-09-03   11:19:05  IST  Sai Mallula

ఆ పేరులో పవర్.. ఆయన మాటలోని పవర్.. సమాజం అంటే అమితమైన ప్రేమ.. అంతకు మించి పిచ్చి.. అందుకోసం తన ఆలోచల్ని ఇజంగా మార్చిన భావకుడతడు. అభిమానం అనే పదాన్ని భక్తి స్థాయి తీసుకువెళ్లిన ట్రెండ్ సెట్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు వింటే అభిమానులకు పూనకం వచ్చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకంటే ఆయన అభిమానులకు పండగే. నిన్న ఆయన పుట్టినరోజు వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. పవన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలపుతుంటే వాటికి లైకులు, రీట్వీటులు, కామెంట్లు చేసుకుంటూ ఈ ఆదివారాన్ని ఆనందంగా గడిపేస్తున్నారు.

Pawan Kalyan First Love Story-

Pawan Kalyan First Love Story

ఇది ఇలా ఉండగా…కొద్దిసేపు ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం తరవాత విడిపోవడం మరొక పెళ్లి చేసుకోడం గురించి అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మద్రాసులో కంప్యూటర్‌ క్లాసులకు వెళ్తున్న రోజుల్లో ఓ అందమైన అమ్మాయి కంప్యూటర్‌ క్లాసులకు వచ్చేది, పవన్‌తో చాలా క్లోజ్‌గా మాట్లాడేది. వారు చాలా క్లోజ్‌గా ఉంటుండటంతో చుట్టూ ఉండే అతడి స్నేహితులు ‘ఇది ఫ్రెండ్‌షిప్‌ మాత్రమే కాదు.. ప్రేమ కూడా.. నీ మనసులో మాట చెప్పేయ్‌’ అంటూ ప్రోత్సహించారంట. ఫ్రెండ్స్ చెప్పిన మాటలతో అది ప్రేమే అనుకుని ఆమెకు తన మనసులోని ప్రేమ విషయం చెప్పడానికి సిద్ధమైపోయారట. ఓ రోజు తన ఇంట్లో ఉండే పాత కారు తీసుకుని ఆమెకు ప్రపోజ్ చేయడానికి వెళ్లారట.

ఆ అమ్మాయిని ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను అంటూ కారులో ఎక్కించుకుని వెళుతుండగా పవన్ కళ్యాణ్ తన మసులోని మాట చెప్పారు. దీనికి ఆమె రియాక్ట్ అవుతూ అసలు ప్రేమంటే ఏమిటనుకున్నావ్‌? ఈ వయసులో ప్రేమేంటి’ అంటూ క్లాసు పీకిందట. ‘ఆ సమయంలో ఆ అమ్మాయి మా క్లాస్‌ టీచర్‌లా కనిపించింది. అన్ని క్లాసులు పీకింది. అంటూ పవన్ కళ్యాణ్ గతంలో ఓ సారి గుర్తు చేసుకున్నారు. ఈ విషయం ఓ సారి న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది. ఆయన పుటిట్నరోజు సందర్బంగా ఇది మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.