పవన్ మనసులో ఇంత బాధ ఉందా .. అందుకే ఇలా చేస్తున్నాడా  

ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఎలా ఉండాలి .. అందునా.. ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న సమయంలో ఎంత స్పీడ్ గా ముందుకు వెళ్ళాలి. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం చాలా నెమ్మదిగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఎక్కడా దూకుడు ప్రదర్శించడంలేదు. దీనిపై ఎన్నిరకాల విమర్శలు వచ్చినా పవన్ మాత్రం అవేవి పట్టించుకునే పరిస్థితుల్లో కనిపించడంలేదు. నిధానంగానే తాను అనుకున్న పనులు అనుకున్నట్టు చేసుకుంటూ వెళ్తున్నాడు. అసలు పవన్ రాజకీయ అడుగులు ఎప్పుడు ఎలా పడతాయో ఎవరికీ అర్ధంకావడంలేదు. అయితే ఆ నిదానం వెనుక అసలు కారణం మాత్రం వేరే ఉందని తెలుస్తోంది.

ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ అన్నయ్య చిరంజీవి చాలా హైరానా పడ్డాడు. ఎన్నికల హడావుడిలో ఎన్నో తప్పులు జరిగాయని, అవన్నీ సరిదిద్దుకునే సమయం కూడా లేకపోవడంతో తీరని నష్టాన్ని ఆ తరువాత చూడాల్సి వచ్చిందని పవన్ లోలోపల బాధపడుతున్నాడు. కానీ జనసేన విషయంలో మళ్ళీ అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటే మంచిది అనే ఆలోచనలో పవన్ కనిపిస్తున్నాడు. అందుకే రాజకీయ విమర్శలు ఎన్ని వచ్చిన పవన్ మాత్రం ఎక్కడా తొందరపడడం లేదు.

Pawan Kalyan Caring About Joining Leaders To Jansena-

Pawan Kalyan Caring About Joining Leaders To Jansena

పార్టీకి నమ్మక ద్రోహం చేసే వారు ఎవరైనా సరే కండువా కప్పకూడదని పవన్ డిసైడ్ అయినట్టు కనిపిస్తున్నాడు. పరకాల ప్రభాకర్ లాంటి మనస్తత్వం నేతలను దరిదాపులకు చేరనివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజారాజ్యంలో జరిగిన తప్పిదాలు మళ్ళీ జనసేనలో కనిపించకుండా ముందుగానే పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్ యువరాజ్యంకు అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పట్లో ఆయన చేరికల విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కేవలం ప్రచారంపైనే దృష్టి పెట్టారు. తర్వాత జరిగిన పరిణామాలను మాత్రం పవన్ దగ్గరుండి గమనించారు.

ప్రస్తుతం జనసేన లక్ష్యం 25 ఏళ్లు. అధికారాన్ని ప్రజలు ఇవ్వకపోయినా 24 ఏళ్ల పాటు ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను ఫోకస్ చేయాలన్న ఉద్దేశ్యంతో జనసేనను ఏర్పాటు చేశారు. కాని అందరు నేతలు అలా ఉండరు. అధికారం లేకుంటే ఆగలేక జంప్ చేస్తారు. వచ్చే ఎన్నికల్లో అధికారం రాకపోయినా జనసేన గుర్తు మీద గెలిచే ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టి వెళ్లకుండా ఉండేందుకు ముందుగానే వారి ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు పవన్. అయితే జనసేనలో ఇప్పుడు పదవులు పొందినవారిలో ఎక్కువమంది ప్రజారాజ్యం నాయకులే. అంటే వారికి అప్పుడు న్యాయం చేయలేకపోయినా ఇప్పుడు న్యాయం చెయ్యాలని పవన్ భావిస్తున్నట్టు అర్ధం అవుతోంది.