ఎక్కువయ్యింది తగ్గించుకోండి ! జనసేనాని సీరియస్ వార్నింగ్ !   Pawan Kalyan At Rottela Panduga In Nellore     2018-09-24   10:14:47  IST  Sai M

రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో జనసేన అధినేత పవన్ కు ఇప్పుడిప్పుడే తెలిసిసొస్తోంది. రాజకీయాలు దూరం నుంచి చూసినంత సులువుగా ఉండవని అందులో దిగితే కానీ ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయో తెలియవని తెలిసొచ్చింది. అవును ఇప్పుడు పవన్ స్థాపించిన జనసేనలో ఆధిపత్యపోరు నడుస్తోంది. అది నాయకులు పవన్ ఫ్యాన్స్ కి మధ్య. ఇది ఈ మధ్య కాలంలో తారాస్థాయికి చేరింది. ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు జనసేనలో చేరడం వారు పవన్ ఫ్యాన్స్ కి సరైన మర్యాద , ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో .. ఫ్యాన్స్ లోలోపల రగిలిపోతున్నారు. మేము కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకువస్తే ఇప్పడు నాయకులు మా మీద పెత్తనం చేయడం ఏంటని వారు ఫ్యాన్స్ ఆగ్రహం వయక్తం చేస్తున్నారు. ఈ పరిణామం పవన్ కి రుచించడంలేదు.

క్రమశిక్షణకు మారు పేరుగా ఉండాల్సిన ఫ్యాన్స్ అప్పుడే ఇలా చేయడం ఏంటని పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అందుకే ఎవరికి వారు ఇగోలతో పార్టీకి నష్టం చేయొద్దని చురకలంటించారు. అభిమానులొక్కరితోనే ఏదీ కాదని, అందర్నీ ఆహ్వానించాలని, కలుపుకొని పనిచేయాలని అన్నారు. అభిమానులూ కాస్త తగ్గండి, తగ్గి అందర్నీ కలుపుకొని వెళ్లండి, అంతేగాని ఇగోలతో విడిపోవద్దు, పార్టీనుంచి ఎవర్నీ విడదీయొద్దు అప్పుడే పార్టీ బాగుపడుతుంది” అని హితబోధ చేశారు.

నెల్లూరు రొట్టెల పండగకు వచ్చిన జనసేనాని పార్టీ కార్యకర్తలతో ఓ హోటల్ లో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో ఓ మహిళా కార్యకర్త తన ఆవేదన చెప్పుకుంది. నిజంగా పార్టీ కోసం పనిచేసి వారికి సరైన గుర్తింపు రావడం లేదని, పవన్ వస్తున్నాడని తెలిసి ఈరోజు చాలామంది హడావుడి చేస్తున్నారని ఆమె లేచి మాట్లాడింది. అప్పటికే ఇటువంటి పరిణామాలపై ఆగ్రహం గా ఉన్న పవన్ తనదైన స్టయిల్లో స్పందించారు.

Pawan Kalyan At Rottela Panduga In Nellore-

వాస్తవానికి జనసేనకు ఏ జిల్లాలోనూ సరైన నాయకత్వం లేదు. క్యాడర్ ఉన్నా అందర్నీ ఏకతాటిపై నిలిపి ముందుకు నడిపించే వారు లేరు. ఎవరికి వారే జనసేన నాయకులమని చెప్పుకుంటూ తిరుగుతున్నారు, గ్రూపులు కడుతున్నారు. ఉన్నట్టుండి హైదరాబాద్ వెళ్లి పవన్ చేత పార్టీ కండువా కప్పించుకుని తిరిగొచ్చి మేమే సిసలైన నాయకులం అని బిల్డప్ ఇస్తున్నారు. అప్పటి వరకూ పవన్ పేరుతో సామాజిక కార్యక్రమాలు చేపట్టిన ఫ్యాన్స్ కి ఈ పరిణామం రుచించడంలేదు. కేవలం నెల్లూరో జిల్లాలోనే కాదు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.